పటిష్ట విధానంలో సర్టిఫీకేట్ల మంజూరు: ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి
విశాఖపట్నం, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం పటిష్ట విధానంలో సర్టిఫీకేట్లను మంజూరు చేయడం జరుగుతోందని ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం యుఎస్ కాన్సులేట్‌కు చెందిన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ విభాగం ఫ్రాడ్ ప్రివిలెన్స్ అధికారి విన్సెంట్ ఛిల్, అనూరాధ సెల్వరాజన్లు ఏయూ పరీక్షల విభాగం అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ సంవత్సరం ఏపీ నుంచి వేలాది మంది విద్యాలు అమెరికాలో ఉన్నత విద్యకు వెళుతున్నారన్నారు. వీరి సర్టిఫీకేట్లను పరిశీలన, గోప్యతపై ఎన్నోజాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు ఆట్లాడుతూ వర్సిటీలో విద్యార్థులకు అందించే సర్టిఫీకేట్లలో ఎన్నోజాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అత్యంత గోప్యత, విశ్వసనీయతతో వీటిని జారీ చేస్తామన్నారు. పరీక్షల విభాగంలో వివిధ దశలలోపర్యవేక్షణ, పరిశీలన జరిపిన తరువాత అధికారుల అనుమతితో వీటిని విద్యార్థులకు అందించడం జరుగుతోందన్నారు. మార్కుల జాబితాలు, ఒరిజనల్ డిగ్రీలు రూపకల్పనలో తీసుకుంటున్న జాగ్రత్తలను కాన్సులేట్ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఆచార్య కె.నిరంజన్, పీజీ డీన్ ఆచార్య కె.చంద్రమౌళి, యూజీ డీన్ ఆచార్య డి.పుల్లారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వై.అంజనా దేవి, అవధాని, ఎం.వి.వి.ఎస్ ప్రకాష్, ఎస్.వి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమెరికా ప్రతినిధులను రిజిస్ట్రార్ సత్కరించారు.


