పరిస్థితులత్ని గుర్తించే పార్టీ మారా: జేసీ
- 89 Views
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం
కర్నూలు: మూడు తరాలుగా తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితులత్ని గుర్తించే పార్టీ మారి తెదేపాలో చేరినట్టు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మచ్చుమర్రి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పరితపిస్తున్నందువల్లే తాము తెదేపాలో చేరినట్టు వివరించారు.
కులం కూడు పెట్టదు.. ఎందుకో రెడ్లంతా వైకాపాకే మద్దతు ఇస్తున్నారని ఈ సందర్భంగా జేసీ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, శ్రీరామకృష్ణయ్యది ఏ కులం అని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. జగన్‌కు బుద్ధిలేదు కాబట్టే పట్టిసీమను వ్యతిరేకించరి ఆరోపించారు. చప్పట్లు కొట్టడం మానేసి ప్రజలంతా చంద్రబాబుకు మద్దతు తెలపాలన్నారు.
Categories

Recent Posts

