పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి!
ఈ నెల 9వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో జరగనున్న జనసేన బహిరంగ సభకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సభ కోసం జేఎస్‌టీయూకే కాలేజీ గ్రౌండ్‌ను నాయకులు సిద్ధం చేస్తున్నారు. సభను జయప్రదం చేయడం కోసం జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. సభను కనివీని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు గ్రౌండ్లో భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలించింది. కాకినాడలో జనసేన బహిరంగసభకు ప్రారంభమైన సన్నాహాలు. లడేంగే.. లడేంగే.. హమ్ జీతే తక్ లడేంగే అంటూ ప్రత్యేక హోదా సాధన కోసం నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.
గత నెల 28న జరిగిన జనసేన సభలో అందరికీ తనదైన స్టైల్లో చురకలంటించారు. అదే ఊపుతో సెప్టెంబర్-9న బహిరంగ సభను నిర్వహిస్తానని ఆరోజే ప్రకటించారు. దీంతో సభ ఏర్పాట్లకు ఆ పార్టీ కార్యకర్తలు చర్యలు చేపడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కొంతకాలం మౌనం వహించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన కార్యచరణ మూడు దశల్లో ఉంటుందని తిరుపతి వేధికగా ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగానే గత నెల 28న తిరుపతిలో సభ నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం తాను, సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలో చర్చించుకున్నామని అందుకే ఇక్కడ సభ పెట్టానని స్పష్టం చేశారు. అలాగే తన తదుపరి సభ కాకినాడలో ఉంటుందని ప్రకటించారు.
జనసేనుడి అభీష్టం మేరకు సభను జయప్రదం చేయడం కోసం జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. సభను కనివీని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించి పనులను వేగవంతం చేసేందుకు జనసేన కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రౌండ్లో భద్రత ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పరిశీలించింది. జనసేనుడి గర్జనకు ఈసారి కాకినాడ వేదిక కానుంది. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూకే గ్రౌండ్లో బహిరంగ సభ తలపెట్టామని, దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారని ఆ పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ తెలిపారు.
సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల కిందట బీజేపీ కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్నారు. ఈ నినాదమే రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ కీలకంగా వ్యవహరించినందున, రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఆ పార్టీయే ఇవ్వాలనే డిమాండుతో పవన్ ఇక్కడ సభ ఏర్పాటు చేశారన్నారు. ఇందుకు అనుమతిచ్చిన జేఎన్టీయూకే యాజమాన్యానికి, పోలీసు శాఖకు రాఘవ కృతజ్ఙతలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ నిర్వహించనున్నారు.
సీమాంధ్ర ఆత్మగౌరవ సభగా ఈ సభకు నామకరణం చేశారు. సభకు సంబంధించి జేఎన్టీయూకేలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్ బీజేపీ కాకినాడ తీర్మానంలో ఒక ఓటుతో రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అందుకు నిరసనగా కాకినాడలో సభను నిర్వహిస్తామని ప్రకటించారు. తిరుపతి సభ ద్వారా పవన్ కేంద్రంలో కదలిక తీసుకురాగలిగారు. రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడుతుండడానికి పవర్‌స్టార్ సభే కారణమని జనసేన వర్గాలంటున్నాయి. కాకినాడ సభ ద్వారా పవన్ కల్యాణ్ మోదీ సర్కార్‌పై మరింత ఒత్తిడి పెంచడం ఖాయమని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పవన్ కల్యాణ్ తిరుపతిలో సభ పెట్టి ప్రత్యేకహోదాపై తన పోరాటాన్ని ప్రకటించిన తర్వాత కొంతమందిలోనైనా కొత్త ఆశలు చిగిర్చి ఉంటాయి. పవన్ కల్యాణ్ కొత్త రకం రాజకీయాలను జాతికి రుచి చూపించబోతున్నారేమో అని ఆశించి ఉంటారు.
కానీ అక్కడ కూడా చాలా మామూలు చీప్ స్థాయి రాజకీయ నిర్వహణే జరుగుతోంది. సెప్టెంబరు 9న కాకినాడలో సభ పెట్టబోతున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కాకినాడలో పవన్ అభిమానులు, జనసేన నాయకులుగా తమను తాము ప్రచారం చేసుకుంటున్న కొందరు వ్యక్తులు స్థానికంగా అడ్డగోలుగా చందాల వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కాకినాడలో సభ పెట్టడానికి సిద్ధమయ్యారనగానే ఆయన తాలూకు శక్తులు మొత్తం చురుకుదనం పుంజుకున్నాయి. ఎటూ పవన్ తన ప్రసంగాల్లో ‘నా దగ్గర డబ్బులు లేవబ్బా’ అని కూడా చెబుతూ ఉంటారు గనుక చందాలు వసూలు చేయడానికి వారి పని ఈజీ అయిపోయింది. సెప్టెంబరు 2న జరిగిన పవన్ కల్యాణ్ పుట్టినరోజు నిర్వహించడానికి, 9వ తేదీన ఆయన పాల్గొనే ప్రత్యేకహోదా సభ ను నిర్వహించడానికి ఖర్చులకోసం అంటూ చందాలు భారీగా వసూలు చేస్తున్నారట. అయితే ట్విస్టు ఏంటంటే ఈ వసూళ్లు పవన్‌కల్యాణ్‌కు తెలిసే జరుగుతున్నాయా అనే అనుమానం కలుగురతోంది.
ఎందుకంటే వీటి గురించి పవన్ చుట్టూ ఉండే కోటరీ వ్యక్తులకు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని, అంటే దాని అర్థం వసూళ్లకు పచ్చజెండా ఊపినట్లే కదా అని స్థానికంగా కొందరు వాపోతున్నారు. తిరుపతి సభ తర్వాత జిల్లాల్లో కొందరు జనసేన నాయకుల హోదాల్లో స్థానికంగా ప్రెస్మీట్లు పెడితే పవన్ కల్యాణ్ తరఫున, జనసేన ప్రతినిదులు వాటిని ఖండిస్తూ అన్ని పత్రికలు, మీడియా సంస్థలకు లేఖలు రాశారు. జిల్లాలో తమ పార్టీ యంత్రాంగం లేదని, అలా ఎవరైనా చెప్పుకున్నా ఆ వార్తలు వేయవద్దని రాశారు. పరువు కోసం అంత జాగ్రత్తలు తీసుకున్న సదరు పవన్ కోటరీ, మరి కాకినాడలో పవన్ సభ పేరిట బజార్ల మీద పడి దందాలుచేస్తూ, పరువును బజారు పాల్జేస్తోంటే ఎలా మౌనంగా ఉంటున్నారో మాత్రం అర్థం కావడం లేదు. మరోవైపు, ప్రత్యేక హోదాపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికే పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై ఆయన గళమెత్తారు. దీంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
తాజాగా ఆయన ఈ నెల 9వ తేదీన కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాకినాడ బహిరంగ సభకు సెంటిమెంట్‌ను జత చేసి ఆయన బిజెపిని మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడలోనే బహిరంగ సభ నిర్వహించడానికి జనసేన పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ చెప్పిన కారణం చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్లో బహిరంగ సభ తలపెట్టామని, దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పదేళ్ల కిందట బీజేపీ కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని చెప్పారు. ఈ నినాదమే రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ కీలకంగా వ్యవహరించినందున, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆ పార్టీయే ఇవ్వాలనే డిమాండుతో పవన్ ఇక్కడ సభ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఇందుకు అనుమతిచ్చిన జేఎన్టీయూకే యాజమాన్యానికి, పోలీసు శాఖకు రాఘవ కృతజ్ఙతలు తెలిపారు. బిజెపిని కార్నర్ చేయడానికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడలో ప్రత్యేక హోదాపై బహిరంగ సభలో మాట్లాడుతారని తెలుస్తోంది. కాకినాడలోనే ఆయన బహిరంగ సభ పెట్టడానికి కారణాన్ని ఆ పార్టీ ప్రతినిధి చెప్పారు.


