పవన్ రెండో భార్యకు ఏమీ ఇవ్వలేదా ?
- 73 Views
- admin
- October 21, 2022
- తాజా వార్తలు రాష్ట్రీయం
మూడు పెళ్లిళ్ల వ్యవహారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌ను ఇబ్బందికరంగా మారుస్తోంది. ఆయన ఎంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా మూడు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలు ఆయన్ను ఇరిటేట్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని తన తాజా వ్యాఖ్యలతో చెప్పేశారని చెప్పాలి. విడాకులకు సంబంధించి తన మొదటి భార్యకు రూ.5కోట్లు చెల్లించానని.. రెండో భార్యకు కొంత ఆస్తి ఇచ్చినట్లుగా చెప్పారు. 2013లో పవన్ అధికారికంగా విడాకులు పొందిన తర్వాత నుంచి ఆమె ఫూణెలో పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది. రేణు తాజాగా చేసిన పోస్టులో ‘నీ వెర్షన్ కాదు.. నా వెర్షన్ కాదు. నిజం అనేది ఒకటి ఉంటుంది. సత్యం శాశ్వతంగా ఉంటుందనేది నేను లైఫ్‌లో నేర్చుకున్న అంశం’ అంటూ ఒక కొటేషన్ ను రీల్ రూపంలో పెట్టారు. దీని అర్థమేమిటి ? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. విడాకుల అనంతరం ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎలాంటి భరణం తీసుకోలేదని చెప్పారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపక్క రేణు తాను ఎలాంటి భరణం తీసుకోలేదని చెబుతుంటే.. పవన్ మాత్రం తాను తన ఆస్తిలో కొంత భాగాన్ని ఆమెకు ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు.


