పశ్చిమ గోదావరి జిల్లాలో 21.5 మి.మీ. వర్షపాతం
- 105 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబర్ 3 (న్యూస్టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 21.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఇన్ఛార్జ్ టి. సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1032.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లాలో అత్యధికంగా బుట్టాయిగూడెం మండలంలో 86.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది.
కాగా కొయ్యలగూడెం 53.4, జీలుగుమిల్లి 51.2, తణుకు 50.6, పెరవలి 49.4, నిడదవోలు 45.8, చింతలపూడి 39.4, వీరవాసరం 38.6, భీమవరం 38.4, పెనుగొండ 37.6, టి.నర్సాపురం 33.4, పెనుమంట్ర 31.8, పాలకొల్లు 31.4, పాలకోడేరు 30.2, యలమంచిలి 29.6, పోడూరు 28.4, ఆచంట 27.2, పోలవరం 25.2, ద్వారకాతిరుమల 25, ఉండ్రాజవరం 24.8, గోపాలపురం, జంగారెడ్డిగూడెంలలో 21.4, తాళ్లపూడి 19.8, నరసాపురం 16, పెంటపాడు 15.8, చాగల్లు, మొగల్తూరులలో 15.2, వేలేరుపాడు 13.8, కామవరపుకోట 13.6, నల్లజర్ల, ఇరగవరం, కుకునూరులలో 13.2, తాడేపల్లిగూడెం 12.8, కొవ్వూరు 8.2, కాళ్ల 7.6, అత్తిలి 6, దేవరపల్లి 4.6, లింగపాలెం, పెదపాడులలో 4.2, ఆకివీడు 3, నిడమర్రు, గణపవరంలలో 2.8, ఉండి 2.4, ఉంగుటూరు 2.2, పెదవేగి మండలంలో 1.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. సెప్టెంబరు మాసంలో ఇప్పటివరకూ 3.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 7.4 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైనట్లుగా ఆప్రకటనలో సిపిఓ తెలిపారు.


