పాకిస్తాన్ కథ ముగిసినట్టేనా?
- 105 Views
- wadminw
- September 22, 2016
- అంతర్జాతీయం
వాషింగ్టన్, సెప్టెంబర్ 22: భారత్ – పాకిస్తాన్ మధ్య ఎన్నో ఏళ్ళ తరబడి ఇబ్బందికర పరిస్థితి ఉండనే ఉంది. పాకిస్తాన్ తీవ్రంగా భారత్ ని గాయాల పాలు చేస్తూ, చావు వరకూ తీసుకెళ్ళి చుక్కలు చూపిస్తూ ఉంటే భారత్ సైలెంట్‌గా నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి. తలచుకుంటే ఇప్పటికి ఇప్పుడే పాక్ మీద యుద్ధం ప్రకటించగల దేశం భారత్ కానీ అనేక దౌత్య , రాజకీయ నీతుల కారణంగా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి మనది. ఎన్నో ఏళ్ళుగా రెండు దేశాల మధ్యన రగులుతున్న కాష్టం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. ఎంతగా అంటే దేశంలో ప్రతీ ఒక్కరూ యుద్ధ భూమిలోకి భారత దేశం దిగాలి అని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ని పీస్ పీస్‌ల లెక్కన భారత పోడిచేయ్యలని వారి కోరిక.
సరిహద్దు సైనికులు నిద్దర పోతున్న తరుణంలో జరిగిన అట్టాక్ తరవాత జనం ఆసలు ఊరుకోవడం లీడు. మౌన ముని మన్మోహన్ పరిపాలనలో లాగానే మోడీ పాలనలో కూడా దేశం సైలెంట్‌గా ఉండాలి అంటే బీజేపీ శ్రేణుల దగ్గర నుంచే సామాన్యుల వరకూ ఎవ్వరూ ఒప్పుకొని పరిస్థితి. ఇలాంటి తరుణంలో అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కి తెరుకోలేని షాక్‌ని ఇచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ అతిపెద్ద వెన్నుదన్ను అనే విషయం స్పష్టంగా ఒక బిల్లు ద్వారా తమ దెస చట్ట సభలో కాంగ్రెస్ తీసుకొచ్చింది. అమెరికాలోని కీలక రాష్ట్రాలు అయిన టెక్సాస్, కాలిఫోర్నియా లకి చెందిన కాంగ్రెస్ సభ్యులు ఈ బిల్లును ప్రతిపాదనకి ఉంచారు. తొంభై రోజుల్లో ఒబామా ఈ బిల్లుకి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి గనక ఈ బిల్లు ఆమోదం అయ్యిందో ఇక జన్మలో పాకిస్తాన్ తేరుకోలేదు. వారి కొంప మునిగినట్టే.
ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఇప్పటికే పాక్‌కు అమెరికా భారీ సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న పఠాన్ కోట ఎయిర్ బేస్ మీద జరిగిన దాడి దరిమిలా ఈ సాయం పునఃపరిశీలించిన అమెరికా పాక్ ప్రమేయం ఈ దాడుల మీద ఉంది అని ఫిక్స్ ఐన తరవాత సాయం లో కొత్త విధించింది. ఇప్పుడు భారత్‌లో తాజాగా జరిగిన దాడి తరవాత భారత సైనికులు 20 మంది చనిపోగా ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు పాకిస్థాన్‌వే అని భారత్ వాదించింది. కానీ దాన్ని పాకిస్తాన్ తోసి పుచ్చింది. ఆధారాలు లేకుండా పాకిస్తాన్ మీద ఎప్పుడూ నిందలు వెయ్యడం భారత్‌కి అలావాటే అంటూ గొడవ చేసారు వారు. అయితే అంతర్జాతీయ మీడియా సాక్షిగా పాకిస్థాన్‌దే తప్పు అనే విషయం భారత్ నిరూపించింది. ఈ వ్యవహారం మీద అంతర్జాతీయ మీడియా వివిధ కథనాలు ప్రచారం చెయ్యగా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా కొత్త బిల్లు ఒచ్చింది.
హెచ్ఆర్ 6069 బిల్లు పేరిట పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం డిజైనేటెడ్ యాక్ట్‌ను కాంగ్రెస్ సభ్యులు టెడ్ పోయే(టెక్సాస్) డానా రోహ్రాబాచర్ (కాలిఫోర్నియా)లు సభ ముందు ప్రతిపాదించారు. సాధారణంగా ప్రతిపక్షం లేదా అధికార పక్షం ఒక బిల్లు పెడితే అధికార లేదా ప్రతి పక్షం నెగెటివ్ గా మాట్లాడడం, ఒద్దు అనడం, గొడవ చెయ్యడం , అది నిజమైన బిల్లు – న్యాయం కాదు అంటూ రాద్ధాంతం చేయ్యడం, కనీస డిబేటు ఉంటాయి కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగ్గపోవడం విశేషం. తొంభై రోజులలోగా ఆ దేశ అద్యక్షుడు దాని మీద సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సదరు నివేదిక లో ఈ బిల్లుని ఒబామా గనక సపోర్ట్ చేస్తే ఇక అమెరికా నుంచి పాకిస్థాన్‌కి అందుతున్న సహాయం పూర్తిగా నిలిచిపోవడమే కాక పాకిస్తాన్ మీద భారీ ఆంక్షలు వెలువడతాయి. తొంభై రోజుల సంగతి కాబట్టి కాస్త వేచి చూడాలి, ప్రస్తుతం తరుణంలో మాత్రం ఐక్య రాజ్య సమితి ముందుగా ప్రసంగించడం కోసం వెళుతున్న పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌కి ఈ బిల్లు పెద్ద తలనొప్పిగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.
ఇష్టమొచ్చినట్టు ఆయుధాల విషయంలో, పక్క దేశం విషయంలో ప్రవర్తిస్తే తరవాత చుక్కలు కనపడతాయి అని ఆయనకి ఈ పాతికే అర్ధం అయ్యుండాలి. అమెరికా లాంటి పెద్దన్న దేశాన్ని కళ్ళు గప్పి భారత్ మీద మూర్ఖత్వపు శత్రుత్వం పెంచుకుంటూ, భారత్ వినాశనాన్ని మాత్రమే కోరుకోవడం దేశ భక్తి అనుకోవడం అమెరికాలోని ప్రధమ విపరీత ధోరణి. దృష్టి మొత్తం భారత్ మీద కాకుండా సొంత దేశ గొప్పతనం, అభివృద్ధి, అక్కడి పిల్లల భవిష్యత్తు – చదువు ఇలాంటి వాటి మీద పెట్టలేకపోవడం ఆ దేశ వెనకబాటు తనానికి కారణం. ఉగ్రవాదులని ఎరేస్తున్నాం అంటూ అమెరికా దగ్గర కోటానుకోట్లు దండుకుని ఆ డబ్బుతో ఇండియా మీద దాడి చెయ్యడం అంటే ఆ దేశ చేతకాని తనం, సిగ్గులేని భవిష్యత్తు కనిపిస్తున్నాయి. మరోవైపు, 125 కోట్ల జనవాహిని. ఆ సేతు శీతాచలం నేడు ఉడికిపోతుంది.
యూరి సెక్టర్లో పాక్ ఉగ్ర మూకలు 18 సెప్టెంబర్ వేకువఝామున 5.30 నిముషాలకు నిద్రిస్తున్న భారత సైనికులపై నిర్దాక్షిణ్యంగా దాడిచేశాయి. 17 మంది భారత సైనికులను చంపి వారి రక్తదాహం తీర్చుకున్నాయి. క్షణక్షణం భారత్ ఉగ్రదాడికి బలౌతూనే ఉంది. దీనికి మన దాయాది దేశం కారణం. ఉగ్ర పాములకు జన్మ నిచ్చి పాలు పోసి పెంచి మన దేశంపై విషం చిమ్మిస్తుంది. భారత్ విభజన అనంతరం – స్వతంత్రం వచ్చినప్పటి నుండి విడిపోయిన మన దాయాది దేశం పాకిస్తాన్ విషనాగై మనపై పగబట్టి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మత చిచ్చు రగిల్చి మొత్తం దేశంపై ఉగ్రతండాల్ని తోలి, రక్తపాతం సృష్టిస్తుంది. పాకిస్తాన్ వల్లనే ప్రజా సంక్షేమానికి అభివృద్దికి ఖర్చు చేయాల్సిన నిధులను దేశ రక్షణ బడ్జెట్‌కు కేటాయించి దేశాభివృద్ధి మందగించి పేదరికం దేశమంతా ముసురుకునే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది.
తెలుగువారైన జెసి దివాకరరెడ్డి అన్నట్లు 10 కోట్ల మంది భారత జనాభా మరణించటానికైనా సిద్దమే భారత మాతకున్న 125 కోట్ల సంతానములో దేశ రక్షణకు ఒక 10% సరిహద్దులకు తరలటానికి సిద్ధపడదాం. పాక్ ఇక విశ్వచిత్ర పటముపై ఉనికిని కలిగి ఉండటానికి ఏలాంటి అవకాశం ఇవ్వకూడదు. పాక్ ఎంత? దాని పరిమాణం ఎంత? భారత ప్రజానీకం ఒక్కసారి ఉమ్మేస్తే చాలు ఆ ఉమ్మి వరద లో కొట్టుకుపోయేంత కూడా లేని దాని సంఖ్యెంత? ఐఎస్ఐ లాంటి దుష్టవ్యవస్థను సృష్టించి భారత్‌పై నరమేధం సాగించే దుష్ట పొరుగు మనకవసరం లేదు. చిన్న దేశాన్ని సంతోషంగా, సంతృప్తికరంగా పాలించుకోగల వ్యవస్థని నిర్మించుకోలేని సత్తా లేని ప్రజానీకం.
ప్రజల సొమ్ము తింటూ వారికి ప్రశాంత జీవనం ఇవ్వలేని సైన్యం, వారి శవాల పైనే పేలాలు ఏరుకొని విలాస జీవితం గడిపే రక్తపింజరులు నివసించే పాకిస్తాన్ లాంటి దేశానికి ఒక జన జాతి కుండవలసిన లక్షణం ఏ ఒక్కటీ లేదు. అహింస పరమోధర్మః అని భావించే భారత జాతిపై రక్తవర్షం కురిపించే కర్కోట, కిరాత, కీచకుల నాయకత్వము లోని పాక్ ను ఆదేశ నాయకత్వములోని మానవత్వం నిద్రలేపటానికి తనదైన విజ్ఞతను, సహనాన్ని, ముందుగా స్పందించటముతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వ్యక్తిగతంగా భారత ప్రజల మనసు నొచ్చుకున్నా లక్ష్య పెట్టక తన స్నేహ హస్తాన్ని అందించటాన్నికి పాకిస్తాన్ వెళ్ళి ఆయన జన్మదినాన్ని పురస్కరించు కుని కలసి రావటం ఆయనలోని భాతృత్వాన్ని శ్లాఘించ వలసిందే.
ఇక ఇప్పుడు స్నేహం మనకవసరం లేదు. ఆ దుష్ఠ కీటకాన్ని సం-హరించవలసిందే. ఇక ఒక్క క్షణం ఆలశ్యం కూడా అమృతాన్ని విషంగా మారుస్తుంది. నాటి తొలితరం భారత పాలకుల అవివెకమో, అతి మంచితనమో, అమాయకమో భారత్ మోసపోయింది. విభజనను అంగీకరించింది. అదే భయానకమైన తప్పిదం. దాని ప్రతిఫలమే మనం మన జమ్ము , కశ్మీర్, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ 70 సంవత్సరాల నుండి ఈ నరకం భరించవలసి వస్తుంది. దేశం ఆర్ధికంగా, నైతికంగా, రాజకీయంగా ఎంతో నష్టపోయాం. పాకిస్తాన్ విభజన జరగకపోయి ఉంటే భారత్ ఒక ఉపఖండంగా మిగిలిపోయేది. 10 కోట్ల ప్రజలు మరణించైనా మళ్ళా భారత ఉపఖండాన్ని నిర్మించుకోవచ్చు.
అపరకాళి లా నాటి ప్రధాని ఇందిరాగాంధి చూపిన తెగువనే ఇంకా ఎక్కువ పటుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రదర్శించి పాకిస్తాన్ పీచమణచటం జాతికి కర్తవ్యం కావాలి. అంతే కాదు పాకిస్తాన్‌ను సమర్ధించే చైనాను అంతర్జారీయంగా ఏకాకులను చేయాలి. పాకిస్తాన్‌కు ఉనికే లేకుండా చేయటమే ఈ భారత తక్షణ కర్తవ్యం కావాలి. దీన్ని ఆదర్శవంత చేయటానికి ముందుగా మనమంతా ఐకమత్యం ప్రదర్శించాలి. ఈ దిన దిన మరణం కంటే ఒక్క సారి భారత ప్రజ సరిహద్ధులకు కదలటం, పోరాటం మన ఉనికి కి ఇప్పుడు చాలా అవసరం. అవసరమైతే 1947 తొలినాళ్ళ నాటి భారత్‌ను మరల సృష్టించాలి. పాకిస్తాన్‌ను విశ్వచిత్రపటంపై నుండి డిలీట్ చేయటం తక్షణ కర్తవ్యం కావాలి. ప్రధాని, హోమ్‌మంత్రి, రాష్ట్రపతి అద్భుతంగా స్పందించారు. మరణించిన మన సైనిక సోదరుల ఆత్మలు సంతోషించేలా దోషులను శిక్షించాలి. దానికి పాకిస్తాన్ సహకరించాలి. అది జరగక పోతే పాకిస్తాన్‌పై సైనిక చర్యకు వెనుకాడరాదు.


