పాతబస్తీలో కాల్పుల కలకలం
- 100 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఆగస్టు 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాతబస్తీలో వివివాహ వేడుక సందర్భంగా గుర్రంపై వూరేగుతున్న వరుడు అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఓకే సారి రెండు రివాల్వర్లతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వరుడు ఓ పోలీసు అధికారి సమీప బంధువని తెలుస్తోంది. ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు.
కాల్పుల ఘటన జరగలేదని, వదంతులు నమ్మ వద్దని తొలుత దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. కాల్పుల దృశ్యాలు మీడియాలో రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలావుండగా, దిచక్ర వాహనాన్ని వెనుకనుంచి టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతిచెందారు. ఆమె భర్త, మూడేళ్ల కుమారుడు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. నగరంలోని కొత్తపేట సమీపంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన బానోతు శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగి. అతని భార్య కవిత(26)గృహిణి.
ఆమె ప్రైవేటుగా ఎంబీఏ చేస్తున్నారు. వారి కుమారుడు కృష్ణలోహిత్(3) నర్సరీ చదువుతున్నాడు. ఏంబీఏ పరీక్షలు రాసేందుకు కవిత, కుమారుడు కృష్ణలోహిత్ను తీసుకుని శ్రీనివాస్ శనివారం అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని బ్రిలియంట్ కళాశాలకు వెళ్లారు. పరీక్ష ముగిసిన అనంతరం ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై నగరానికి వస్తుండగా, బాహ్యవలయ రహదారి జంక్షన్లో గండిచెరువు వెళ్లేదారికి సమీపంలో వెనుకనుంచి టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ టైర్లు కవితపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, కృష్ణలోహిత్లను స్థానికులు చికిత్స నిమిత్తం 108అంబులెన్సులో ఎల్.బి.నగర్ సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కృష్ణలోహిత్ చేయి తెగిపడింది. ఈమేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


