పార్కులు ఏర్పాటుకు ముందుకు రావాలి: కమిషనర్ పిలుపు
- 68 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): పార్కులు ఏర్పాటు, నిర్వహణకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్లు ముందుకు రావాలని జివియంసి కమీషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన క్షేత్రపర్యటనలో దసపల్లాహిల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పర్యటించారు. ఈ సందర్భముగా చెత్తనిర్వహణ ద్వారా రోడ్లపై చెత్తలేకుండా చూడాలని కోరారు. గాంధీపార్క్ను సందర్శించారు, గాంధీపార్క్ కూడలిలోని గెడ్డలో చెత్తలేకుండా చూడాలని ఆదేశించారు. ఊటగెడ్డ వద్ద నిర్వహిస్తున్న డ్రెయిన్ పనులను పరిశీలించారు.
19వ వార్డులో పర్యటించి పలుసూచనలు చేశారు. పారిశుద్ధ్యం పట్ల దసపల్లా ఆర్.డబ్ల్యూఏలు శ్రద్ధ వహించడంపట్ల అభినందనలు తెలిపారు. పార్కు ప్రదేశాన్ని చీఫ్ ఇంజనీర్ సందర్శించి ప్రణాళికా, అంచనా వ్యయం రూపొందించాలని సూచించారు. బల్క్వేస్ట్ జనరేటర్స్, కాలనీవాసులు చెత్ల ఏర్పడినచోటే విభజన నిర్వహణ ద్వారా కంపోస్ట్ తయారీకి సహకరించడం ద్వారా స్వచ్ఛవిశాఖ లక్ష్యం నెరవేర్చాలని పేర్కొన్నారు. పర్యటనలో మూడవ జోనల్ కమీషనర్ వి.చక్రధరరావు, ఏసిపి సత్యనారాయణ, ఆర్.డబ్ల్యూఏ సభ్యులు అమ్మాజీ, కాశిరాజు, మల్లిక్, జి.జె.మేడమ్, గోపాలరాజు, యం.యస్.ఆర్ కేటరింగ్ ప్రతినిధులు, జోనల్ సిబ్బంది పాల్గొన్నారు.


