పార్టీ మారాలనుకుంటే మారండి…
- 27 Views
- admin
- February 1, 2023
- తాజా వార్తలు
ఫోన్ ట్యాపింగ్ వేరు, ఫోన్ రికార్డింగ్ వేరని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మధ్యలో ఎవరో మూడో వ్యక్తి రికార్డ్ చేస్తే దాంతో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అని మంత్రి అమర్ నాథ్ ప్రశ్నించారు. కోటంరెడ్డి పార్టీ మారాలనుకుంటే మారొచ్చు కానీ ఇలాంటి ఆరోపణలు సరికాదని అన్నారు. కొన్నాళ్లుగా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడం తనకిష్టం లేదని అన్నారు. మనసు ఒక చోట, శరీరం మరో చోట కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై విధండా స్పందించారు.
Categories

Recent Posts

