పునర్విభజన ప్రక్రియ వేగవంతం: కలెక్టర్
మెదక్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు రోనాల్డ్‌రోస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో పునర్విభజన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన దస్త్రాల స్కానింగ్‌తో పాటు ఏ జిల్లాకు పంపాల్సిన దస్త్రాలను ఆ జిల్లాకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాగా, సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో బుధవారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. ఐటీఐ ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు అందేలా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ కురుమూర్తి, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాగా.శత చండీ మహా యాగ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన బుధవారం స్థానిక భవాని భువనేశ్వరి దేవాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. రాంపురం పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం కూడా పూజ కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.
రాష్ట్రస్థాయి పుట్‌బాల్ పోటీలకు ఎంపిక
మెదక్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): మెదక్ పట్టణంలో వచ్చె నెల జరిగే జిల్లా స్థాయి పుట్‌బాల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు మెదక్ జిల్లా పుట్‌బాల్ అసోసియెషన్ ప్రధానకార్యదర్శి ఆర్ .నాగరాజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5,6,7వ తేదిలలో జరుగనున్న రాష్ట్ర స్థాయి వాలిబాల్ పోటీలలో పాల్గోంటారని తెలిపారు.స్థానిక వెస్లీమైదనాంలో బుధవారం జరిగిన క్రీడాకారుల ఎంపికలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గోన్నారు. 18మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిధి జహిరాబాద్, సంగారెడ్డి, బిహెచ్ఈఎల్, రామాయంపేట , మెదక్ , నర్సాపూర్ మండల కేంద్రాలనుండి క్రీడాకారులు పాల్గోన్నారు. ఈ ఎంపికలలో పిఈటీలు రూపెందర్, గోపాల్ , యస్.నాగరాజు, మధు, శ్రీనివాస్‌రావు, పుట్‌బాల్ క్లబ్ సభ్యులు ,గోపాల్, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు పాల్గోన్నారు. కాగా, తెలంగాణ జాగృతి యువజన విభాగం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా చిన్నకోడూరు మండలం చర్లఅంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. సిద్దిపేటలో జాగృతి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు ఈ మేరకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. జాగృతి ద్వారా నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.
మెదక్ జిల్లాలో భారీ వర్షంతో ఉప్పోంగుతున్న వాగులు
మెదక్, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ కురిసిన భారీ వర్షాలకు జహిరాబాద్, కొహీర్ మండలల్లో నారింజ, గోటిగార్ ప్రాజేక్టు పోంగి పోర్లుతున్నాయి. జిన్నారము మండలం అక్కమ్మ చెరువులో సెల్ఫీ దిగుతున్న రాము ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకోనిపోయారు.మెదక్ పట్టణశివారు లోని పసుపులేరు వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. కాగా, జహీరాబాద్ ప్రాంతంలో బుధవారం మోస్తారుగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి జహీరాబాద్ మండలంలో 2.6 సెం.మీ, కోహీర్ మండలంలో 3.6 సెంటీమీటర్లు, ఝరాసంగం మండలంలో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకే జహీరాబాద్ సమీపంలో గల నారింజ ప్రాజెక్టులోకి సామర్థ్యం మేరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు షటర్ల పైనుంచి కొద్ది మేర నీరు బయటకు పోయింది. మంగళవారం రాత్రి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో కురిసిన వర్షాలకు నారింజ ప్రాజెక్టులోకి తిరిగి కొంత నీరు వచ్చి చేరింది. వచ్చి చేరిన నీరు ప్రాజెక్టు గేటు షటర్ల పైనుంచి ప్రవహిస్తుంది. సుమారు రెండు అంచుల మేర నీరు బయటకు పోతుంది. మయటకు పోతున్న నీరు నారింజ జలం కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి పోయింది. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాభావంతో నారింజ ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో సామర్థ్యం మేరకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతం నుంచి నారింజ జలాలు కర్ణాటక ప్రాంతంలోకి పోతుండడంతో అ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహీర్ మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు కూడా గతంలో కురిసిన వర్షాలకు సామర్థ్యం మేర నీటితో నిండింది. దీంతో అదనపు నీరు కర్ణాటకకు పోతుంది.


