పూరి బడ్జెట్‌కు నందమూరి హీరో మైండ్ బ్లాంక్
నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ కెరియర్లో రెండంటే రెండో హిట్లు అందుకున్నాడు. అయితే ప్రస్తుతం కుర్ర హీరోలంతా ట్రెండ్ మారుస్తుంటే తాను కూడా కొత్తతరగా పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా ఇజం. పూరి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ను కొత్త స్టైల్లో చూడొచ్చు. ఆ విషయం ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికి తెలిసేలా చేసిన పూరి సినిమాతో కళ్యాణ్ రామ్ ఇమేజ్ను పూర్తిగా మార్చేస్తున్నాడట.
ఇజం సినిమాను తన ప్రొడక్షన్లోనే నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ తన బడ్జెట్‌కు మించి పెట్టేశాడట. పటాస్‌తో 20 కోట్ల షేర్ తెచ్చిపెట్టుకున్న కళ్యాణ్ రామ్ ఆ రేంజ్లో బడ్జెట్‌కే ఫిక్సయ్యాడు కాని పూరి టేకింగ్‌తో సినిమాను ఇంకాస్త రిచ్‌గా తీసేందుకు బడ్జెట్ పెంచేశాడట. దాదాపు సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇజం మొత్తం 26 కోట్లకు వచ్చిందట. మరి సినిమా వర్క్ అవుట్ అయితే ఓకే కాని ఫ్లాపుల్లో ఉన్న పూరి మీద నమ్మకంతో అంత బడ్జెట్ అది కళ్యాణ్ రామ్ పెట్టాడంటే కాస్త ఆలోచించాలి.
అయితే, బడ్జెట్ విషయం ఎలా ఉన్నా కళ్యాణ్ రామ్ మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పూరి డైరక్షన్లో సినిమా ఓ పిక్ నిక్లా ఉంటుందని అంతకుముందే చెప్పాడు కూడా. సో జాలీగా చేస్తున్న ఈ సినిమా తన కెరియర్లో మంచి సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుందని అంటున్నాడు. లాస్ట్ ఇయర్ పటాస్‌తో కామెడీ ఎంటర్టైనర్తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి ఇజంతో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇక సినిమాలో సిక్స్ ప్యాక్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఫ్లాపుల్లో ఉన్న పూరి తన కసి అంతా సినిమా మీద పెడుతున్నాడట. మరి పూరి ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మరి పూరి మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఇజం నందమూరి హీరోకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు.


