పెరుగులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య రహస్యాలు
- 80 Views
- wadminw
- January 9, 2017
- Home Slider సినిమా
పెరుగు ప్రాచీన కాలం నుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగులో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా ఇండియాలో కొన్ని స్టేట్స్ లేదా ప్రదేశాల్లో నివసించే ప్రజలు తీసుకొనే ప్రతి భోజనంతో పాటు పెరుగు తప్పనిసరిగా తీసుకుంటున్నారు. పెరుగును వివిధ రకాలుగా తీసుకోవడం ఉత్తమం. ఇలా తీసుకోవడం వల్ల మీ జీవనశైలిలో మీకు అవసరం అయ్యే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
ఎవరైతే ల్యాక్టోజ్ లోపంతో బాధపడుతున్నారో, అటువంటి వారు కూడా పెరుగును ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఆహారంతో పాటు తీసుకోవడంతో పాటు, వివిధ రకాల హోం రెమెడీస్‌తో తీసుకోవడం వల్ల పెరుగుతో అనేక ప్రయోజనాలున్నాయి. అది ఆవు పాలు లేదా గెదెపాలతో వేటితో తయారుచేసిన పెరుగును రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన శరీరంను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. నిజానికి, పాలను మరిగించినా కూడా అందులోని పోషకాలు ఏమాత్రం తగ్గవు. కాబట్టి, మహిళలు మీరు ఇంట్లో తయారుచేసే వివిధ రకాల వంటలు, కర్రీస్లలో పెరుగును చేర్చడం మర్చిపోకండి.
మరి పెరుగులోని ఆ అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పెరుగు శరీరానికిచల్లదాన్ని కలిగించి, జీర్ణశక్తిని పెంచుతుంది. తర్వాత ఆహారాన్ని శరీరం గ్రహించేందుకు సహాయపడుతుంది. నిజానికి మీరు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు, పెరుగు తీసుకోవడం చాలా ఉత్తమం. స్పైసీ బిర్యానీ తిన్నప్పుడు, పెరుగును తీసుకోవడం మర్చిపోకండి. పెరుగు గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ క్రమబద్దం చేయడానికి సహాయపడుతుంది. పెరుగును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
పెరుగువల్ల ఇది ఒక గొప్ప న్యూట్రీషియనల్ బెనిఫిట్. శరీరం రోగనిరధక శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది పెరుగు. మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. పెరుగులో క్యాల్షియం, ఫాస్పరస్ అంశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండూ కూడా ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్యలను మీరు నివారించుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీరెగ్యులర్ డైట్లో పెరుగు చేర్చుకోవడం ఉత్తమం. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి బహిర్గతంగా పెరుగును ఉపయోగించుకోవచ్చు.
పెరుగు, నిమ్మరసం కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది. వారానికి రెండు సార్లు, ఒక నెలపాటుచేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఒక గొప్ప యాంటీ డాండ్రఫ్ సొల్యుషన్. కొంత పెరుగును తలకు పట్టించి, మసాజ్ చేసి తలస్నానం చేయడం వల్ల చుండ్రు పూర్తిగా నివారించబడుతుంది. ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది, అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్లో పెరుగుచేర్చుకోవడం కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది.
పెరుగు ఒత్తిడిని, ఆందోళను తగ్గిస్తుంది. పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం. ఇది శరీరం లోపల కూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది. పైల్స్‌తో బాధపడే వారు, వారి రెగ్యులర్ డట్లో పెరుగు చేర్చడం వల్ల చాలా సహాయపడుతుంది. పెరుగుతోపాటు, కొద్దిగా అల్లం చేర్చుకొన్న మంచి ఫలితం ఉంటుంది. ఓరల్ సమస్యలను పెరుగు నివారిస్తుంది. బ్యాక్టీరియ సంబంధిత దంత సమస్యలను నివారించడంలో పెరుగు గ్రేట్‌గా సహాయపడుతుంది. ఆకలిని పెంచడానికి పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది.


