పెళ్ళైన మగవారు ఫ్లర్ట్ చేస్తున్నారా?
- 82 Views
- wadminw
- January 9, 2017
- Home Slider సినిమా
అవునండి ఇది నిజం. పెళ్ళైన మగవారు కొందరు పరాయి ఆడవారిని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆఫ్ కోర్స్, కొంతమంది ఆడవారు కూడా ఫ్లర్ట్ చేస్తారు. అయితే, ఇవి సాధారణ స్థాయిలో ఉంటే పట్టించుకోనవసరం లేదు. అయితే ఎప్పుడైతే లిమిట్స్ దాటిపోయినట్టు మీకు అనిపించినా వెంటనే చర్యలు తీసుకోకపొతే తద్వారా ఎదురయ్యే ఇబ్బందులు మీకు తలనొప్పులు తెచ్చిపెడతాయి. ఫ్లర్టింగ్ లెవల్స్ ‘టచింగ్’ వరకూ వెళ్ళే ఆస్కారము లేకపోలేదు. అందువల్ల, పెళ్ళైన మగవారు ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తే తక్షణమే వారి ప్రవర్తనపట్ల మీరు సానుకూలంగా లేరన్న విషయాన్ని వారికి తెలియచేయండి మీరు సైలెంట్ గా ఉండకూడదు.
సైలెంట్‌గా ఉంటే మీరు కూడా వారి ప్రవర్తనను ఆస్వాదిస్తున్నారనే అపోహలో వారు మరింత ఇబ్బందులను మీకు సృష్టిస్తారు. అందువల్ల, పెళ్ళైన మగవారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తే కచ్చితంగా వారిని అడ్డుకోండి. ఈ కింది పద్దతుల ద్వారా వారికి మీ ఉద్దేశ్యాన్ని తెలియచేయండి. పెళ్ళైన మగవారు ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎంజాయ్ చేయకండి పెళ్ళైన మగవారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు వారి ప్రవర్తనని ఎంజాయ్ చేయకండి. పొరపాటున వ్రాంగ్ సిగ్నల్స్ ఇవ్వకండి.
మీరు అతని ప్రవర్తనని ఇష్టపడుతున్నారనే తప్పుడు సంకేతం అందుకుంటే అతను మిమ్మల్ని మరింత ఫ్లర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంకొక అడుగు ముందుకేయడానికి కూడా సంశయించాడు. పెళ్లైందని గుర్తు చేయండి పెళ్ళైన మగవారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేందుకు ట్రై చేస్తే అతనికి పెళ్లైందన్న సంగతిని అతనికి గుర్తు చేయండి. ఇలా గుర్తుచేయడం వల్ల, అతనికి తన కుటుంబం గుర్తుకు వస్తుంది. మంచీ మర్యాద కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే, కచ్చితంగా మీ పట్ల తన ప్రవర్తనను సరి చేసుకుంటాడు. అయినప్పటికీ, అతని ప్రవర్తన మారకపోతే, మీరు అతనికి సరి అయిన గుణపాఠం చెప్పడానికి వెనుకాడకండి.
ఇష్టం లేదని చెప్పండి పెళ్ళైన మగవారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి చేస్తున్నాడంటే అతనికి మీరంటే ఇంట్రెస్ట్ అని అర్థం. మీనుంచి ఆటను కిస్ ని ఆశిస్తున్నాడని అర్థం. అటువంటి వారికి మీరు దూరంగా ఉండడం మంచిది. డైరెక్ట్ గా అతనికి అతని ప్రవర్తన మీ పట్ల సముచితంగా లేదని స్పష్టంగా చెప్పండి. అతని నుంచి దూరంగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. రిపీట్ చేయవద్దని చెప్పండి అతని ప్రవర్తన మీకు నచ్చడం లేదని, ఈ విధంగా మీతో ప్రవర్తించడం బాగాలేదని సూటిగా చెప్తూ మళ్ళీ ఇటువంటి ప్రవర్తన పునరావృత్తం కాకూడదని హెచ్చరించండి. ఒక వేళ, మీరు కూడా అతని ఫ్లర్టింగ్ నచ్చితే మీ జీవితానికి ఎవరూ బాధ్యులు కారన్న విషయం గుర్తుంచుకోండి.


