పేదలందరికీ సొంతఇల్లు: ఎమ్మెల్యే బుజ్జి హామీ
- 97 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
సాధికారిత సర్వే ఆధారంగా ఏలూరులో ప్రతీ పేద కుటుంబానికీ ఇల్లు నిర్మించి పేదలకు ఆఇల్లు ఒక ఆస్ధిగా మారుస్తామని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గం పరిధి సత్రంపాడులో మంగళవారం సాయంత్రం జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ స్వంత ఇల్లు లేక అద్దెలు చెల్లించుకోలేని పేదవర్గాలందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని జన్మభూమి గ్రామసభల్లో ఆధార్ కార్డుతో ధరఖాస్తు చేసుకోవాలని వారి పేర్లను ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపిస్తామని భవిష్యత్తులో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ఒక ప్రణాళిక అమలు చేయనున్నారని శ్రీ బడేటి బుజ్జి చెప్పారు.
ప్రజల ఆర్ధిక పరిస్ధితులు మెరుగుపరిచి ప్రతీ మహిళా నీతివంతంగా ప్రతీ నెలా 10 వేల రూపాయలు సంపాదించే స్ధాయికి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున మేకలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. చదువు ఒక్కటే అభివృద్ధికి మార్గమని పేదలను చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. నిర్భంధ విద్యావిధానాన్ని అమలు చేసి ప్రతీ ఒక్కరూ చదువుకునేలా పటిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర బడ్జెట్లో 20 వేల కోట్ల రూపాయలు కేవలం ఒక విద్యకే కేటాయిస్తున్నామని శ్రీ బడేటి బుజ్జి చెప్పారు. చదువుకుంటేనే వివిధ రంగాలలో రాణించగలుగుతారని అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని శ్రీ బడేటి బుజ్జి చెప్పారు.
85 శాతం మార్కులు సాధించి పై చదువులు చదవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే ప్రతీ ఒక్కరినీ చదివిస్తానని పేదరికం చదువుకు అడ్డు కాదని గత 7 నెలల కాలంలో తన స్వంత సొమ్ము 18 లక్షల రూపాయలు పేద విద్యార్ధుల ఫీజులుకోసం చెల్లించి వారి విద్యకు సహకరిస్తున్నానని శ్రీ బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి శ్రీ చంద్రబాబు 800 కోట్ల రూపాయల కేటాయించారని, విళీన గ్రామాలభివృద్ధికి కూడా నిధులు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. పంచాయతీలలో వీధిలైట్ల భారం తగ్గించాలనే ఉద్ధేశ్యంతో అన్నీ గ్రామాలలో వీధిలైట్లను యల్ఇడి బల్భ్లుగా మారుస్తున్నామని ఆయన చెప్పారు.
గత మూడు దశాబ్దాలుగా తనకు రాజకీయ అనుభవం ఉన్న దృష్ట్యా ఏలూరులో రోడ్లు, డ్రైయిన్లు, వీధిలైట్లతో పాటు ప్రజలకు ఏవిధమైన మౌలిక వసతులు కల్పించాలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతున్నామని బడేటి బుజ్జి చెప్పారు. ఎఎంసి ఛైర్మన్ కూరెళ్ల రామప్రసాద్, ఏలూరు యంపిపి రెడ్డి అనురాధ, జడ్పిటిసి మట్టా రాజేశ్వరి, సర్పంచ్ రత్నకుమారి, తహశీల్ధారు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు చంద్రన్న సంక్రాంతి కానుక, క్రొత్త రేషన్ కార్డులు, స్కాలర్షిప్లను బడేటి బుజ్జి అందజేసారు.


