పేదలకు ‘ఆకర్ష్’ వల
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఉన్న తెలివితేటలు బహుశా మరెవరికీ ఉండవేమో. బయటకు కనిపించకపోరునా, ఆయనలో కాకలు తీరిన, కరడుకట్టిన రాజకీయవేత్త దాగి ఉన్నాడన్న విషయం తాజాగా రైతుల రుణమాఫీ సందర్భంగా ఆయన చేస్తున్న ఆలోచన చూస్తుంటే అర్ధమవుతోంది. ఇప్పటి వరకూ అసలు అమలు చేస్తారో లేదో అనుకున్న రుణమాఫీపై కేసీఆర్ సర్కారు సరికొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. పసుపు, చెరకు, మిరప వంటి వాణిజ్య పంటల సాగుకు రైతులు తీసుకొన్న రుణాలను కూడా రుణమాఫీ పథకంలో చేరిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్త ఆ పంటలు పండించి నష్టపోరున రైతాంగంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ రూపొందించిన రుణమాఫీ పంటరుణాల జాబితాలో వాణిజ్య పంటలు లేవన్న విషయం తెలిసిందే.
ఈ పంటల రైతులు తమ రుణాలను కూడా మాఫీ చేయాలని మంత్రులను గట్టిగా కోరుతున్నారు. ఇవి వాణిజ్య పంటల జాబితాలో ఉన్నందున వీటి సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణమొత్తం వరి, మొక్కజొన్న వంటి ఆహార పంటలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. రుణమొత్తం ఎంత ఉన్నా ఒక్కో రైతుకు మాఫీ చేసేది రూ.లక్ష మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణరుంచింది. ఈ నేపథ్యంలో వాణిజ్య పంటలు సాగుచేసిన రైతులు తీసుకున్న రుణాలు ఏ మేరకు ఉంటాయో పరిశీలించాలని రుణమాఫీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించింది. ఇప్పటికే గ్రామాల నుంచి వచ్చిన రుణఖాతాల జాబితాలను తనిఖీ చేస్తున్నారు. వీటిలో వాణిజ్య పంటల రుణాలు తీసుకున్న రైతుల వివరాలున్నా.. పంట రుణాల జాబితాలోకి రావని పక్కనపెట్టారు. వాణిజ్య పంటల సాగుకాలం దాదాపు ఏడాది వరకూ ఉంటుందని వాటిని కొన్ని బ్యాంకులు దీర్ఘకాలిక(టర్మ్) రుణాల పేరుతో ఇస్తున్నాయని మంత్రివర్గ ఉపసంఘంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
రుణమాఫీ స్వల్పకాలిక పంటరుణాలకే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ తెలంగాణలో పసుపు, మిరప, చెరకు సాగుచేసే రైతుల సంఖ్య అధికంగా ఉంది. రుణమాఫీ నుంచి వీరిని మినహారుస్తే ఎక్కువ మందికి లబ్ధి కలిగే అవకాశం ఉండదని రైతు సంఘాలు చెబుతున్నారు. ఈ పంటల రైతులు కూడా తమ రుణాలు మాఫీ అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ పంటల రుణ బకారులు ఎంతమేర ఉన్నాయనే లెక్కలు తేలిన తరవాత వీటి మాఫీపై ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. రుణమాఫీపై తుది నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే మూడు దఫాలు సమావేశమై చర్చించింది. మరో నాలుగైదు రోజుల్లో మాఫీపై తుది నిర్ణయాలు తీసుకుని సీఎంకు నివేదిక ఇవ్వనుంది. దసరా పండగనాటికల్లా రుణమాఫీపై పూర్తి నిర్ణయాలు ప్రకటించి రైతులకు లబ్ధి చేకూర్చేలా అన్నీ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయశాఖలు కసరత్తులు చేస్తున్నారు.
మరోవైపు, ఓడ దాటేదాక ఓడ మల్లన్నా… రేవు దాటించాకా బోడి మల్లన్న అన్న చందాన ఉంది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరు. మాట తప్పడంలో రెండాకులు ఎక్కువే చదివిన చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని ఆచరణలోకి వచ్చేసరికి తుంగలోకి తొక్కుతున్నారు. మాఫీ భారం తగ్గించుకునే నెపంతో వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తించదని తేల్చిన మంత్రివర్గం వాణిజ్య పంటల రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. రుణమాఫీ భారాన్ని తగ్గించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న చంద్రబాబు ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదనే విషయాన్ని తేల్చేశారు. ఉద్యానవన పంటల రైతులకు రుణమాఫీ వర్తించదని జీఓ 174లో ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ జీఓపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, జీఓలోని కొన్ని అంశాల్లో మార్పులు చేరుస్తామని మంత్రులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఉద్యానవన పంటలకు కూడా మాఫీ అమలు చేసే నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీఓ 174పై చర్చ జరిగింది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మార్చి 31 మధ్యలో అప్పు చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించదనే నిబంధనపై రైతు సంఘాలు మండిపడుతున్నందున, దీనిని మార్పు చేయాలనే మంత్రుల సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. జీఓలో కొన్ని సవరణలు చేసి, దాని స్థానంలో జీఓ 181ను విడుదల చేసింది. ఇందులో ఉద్యానవన పంటలకు రుణమాఫీ విషయాన్ని పక్కన పెట్టింది. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన వాణిజ్య పంటల రైతులు ప్రభుత్వ తాజా నిర్ణయంతో హతాశులయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రివర్గ సమావేశంలో ఉద్యానవన పంటలకు సైతం రుణమాఫీ వర్తింపజేయాలని కొందరు మంత్రులు కోరగా, చంద్రబాబు తిరస్కరించారు. సాధారణంగా వాణిజ్య పంటలకు రుణ అర్హత (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఎక్కువగా ఉంటుంది.
వరికి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.24,500, రబీలో రూ.30 వేలు ఉండగా, వాణిజ్య పంటలకు రూ.50 వేలకు పైబడి ఉంటుంది. పసుపునకు ఎకరాకు రూ.55 వేలు, అరటికి రూ.85 వేలు, కందకు రూ.లక్ష వరకు రుణ అర్హత ఉంది. అందువల్ల రుణమాఫీని ఈ పంటలకు వర్తింపజేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుందని భావించిన చంద్రబాబు మాఫీ నుంచి వీటిని తొలగించారు. కొబ్బరి సాగుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (ఎకరాకు రూ.25 వేలు) తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పంట కావడం వల్ల రైతులు దీర్ఘకాలిక (ఎల్టీ) రుణాలు పొందుతుంటారు. దీనివల్ల వడ్డీ భారం పడుతుందని, జీరో పర్సెంట్ వడ్డీ వర్తించదని చెప్పి చాలామంది రైతులు తమ కొబ్బరి తోటల్లో సాగు చేసే అంతర పంటలు అరటి, కంద, పసుపు, కూరగాయ పంటలపై స్వల్పకాలిక (ఎస్టీ) రుణాలు తీసుకుంటారు. ఇవి కూడా పంట రుణాల్లోకి వస్తున్నా మాఫీ వర్తించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. గతేడాది భారీ వర్షాలు, తర్వాత హెలెన్ తుపాను వల్ల వాణిజ్య పంటల రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు.
దీర్ఘకాలిక పంట అరునప్పటికీ ఈ తుపాను వల్ల కొబ్బరికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు ఒక్క కోనసీమలోనే సుమారు 80 వేలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలారు. మిగిలిన చెట్లకు సైతం మొవ్వులు విరిగిపోవడం వల్ల రెండేళ్ల పాటు ఆశించిన స్థారులో దిగుబడులు లేకుండా పోయారు. ఆ నష్ట పరిహారం ఇప్పటి వరకు అందలేదు. అందుతుందన్న నమ్మకం కూడా రైతుల్లో సన్నగిల్లుతోంది. ఈ తరుణంలో రుణమాఫీ కూడా వర్తింప చేయకపోవడంతో ఉద్యానవన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తానని మాటమార్చి కొంతవరకు భారాన్ని తగ్గించున్నారు. తాజాగా ఉద్యానవన పంటలను మినహారుంచి ఆ భారాన్ని మరింత దించుకున్నారు.


