‘పైడి’ పలుకులు…
* కుట్ర, కుతంత్రంతో ఏదీ సాధించలేం.
* బలమే జీవనం, బలహీనతయే మరణం.
* అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయసాధనకు మార్గాలు.
* అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది.
* ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి.
* ఇసుమంత ఆచరణ, ఇరవై వేల టన్నుల వ్యర్ధమైన మాటలతో సమానం.
* ఈ జీవితం క్షణికం! ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూనాళ్ళముచ్చట్లే!
* ఎవరైతే పరులకోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలినవాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క!
* ఏ ఘనకార్యాన్నీ మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి.
* త్యాగం చేయకుండా ముక్తి లేదు. త్యాగం లేకుండా ఉత్తమమైన భగవద్భక్తి లభించదు.
నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దాన్ని తప్ప మరి దేన్ని గురించి ఆలోచించవద్దు.
* పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే, ఆ వ్యక్తి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతాడు.
* పవిత్రుడిగా మెలగు, నిష్కపటిగా ఉండు. క్షణమైనా భగవద్విశ్వాసాన్ని కోల్పోకు.
* పవిత్రత ఒక మహత్తర శక్తి దానిముందు సర్వం భయంతో కంపిస్తుంది.
* పిరికితనంతో కూడిన అనుకరణం వ్యక్తిని ఎన్నడూ ఉన్నతుణ్ణి కానీయదు. అది పతనానికే దారి తీస్తుంది.
* పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వ సాధారణం, అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా?
* భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.
* భయమే మృత్యువునకు హేతువు. ఈ భయానికి కారణం మనం ఆత్మస్వరూపులమనే సత్యాన్ని మరచిపోవడమే!
* భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు పెట్టేవాడు దేన్నీ సాధించ లేడు.
* మనస్సు శాంతితో, ఏకాగ్రతతో ఉన్నప్పుడే, మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు.
* మనస్సు ఎంత నిర్మలమైతే, దాన్ని నిగ్రహించడం అంత సులభమౌతుంది. మనస్సును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికై తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
* మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే!


