పొట్టి రమేష్ భార్య ఆత్మహత్య
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్‌గా పనిచేస్తున్న పొట్టి రమేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య త్రిపురాంబిక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
త్రిపురాంబిక ఆత్మహత్యచేసుకునే మనస్తత్వం కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త, ఆడపడుచు వేధించే వారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని రమేష్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Categories

Recent Posts

