పోలవరం ప్రాజెక్టు పరిహారంలో భారీ అవినీతి
- 80 Views
- wadminw
- January 4, 2017
- Home Slider జాతీయం
ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో 42 గ్రామాలున్నాయి. మొత్తం నిర్వాసితుల్లో గిరిజనులు 70 శాతానికి పైగా ఉన్నారు. ఈ అటవీగ్రామాల గిరిజనులు, గిరిజనేతరుల నివాస గృహలకు, భూమికి పరిహరం చెల్లించే ప్రక్రియలో తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి పోలవరం స్పెషల్ డిప్యూీ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న సబ్బవరపు రామారావు బాధితులకు ఇవ్వాల్సిన చెక్కులు పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి, 15 నుంచి 20శాతం వరకూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని గిరిజనులు బాహాటంగా చెబుతున్నారు.
నేరుగా కాకుండా దందాకు అనుకూలంగా ప్రైవ్‌ే ఏజెంట్లను నియమించుకుని ఇష్టారీతిన రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. గిరిజనుల భూమికి భూమి ఇవ్వకుండా, కేసులున్న గిరిజనేతరుల నుంచి డబ్బులు తీసుకుని పరిహారం ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. గొందూరులో బాధితులకు పరిహరం చెక్కులను నేరుగా గ్రామంలో పంపిణీ చేయాల్సిఉంది. అయితే గొందూరు బాధితులను రాజమండ్రికి రప్పించి కూరగాయల మార్క్ట్లో చెక్కులు పంచి 20 శాతం పర్సంటేజ్ ముక్కుపిండి మరీ వసూలు చేసినట్లు గిరిజన నేతలు చెబుతున్నారు. అడ్డగోలుగా చెక్కులు పంపిణీ చేస్తూ పెద్ద అవినీతి తిమింగళంగా మారాడని అంటున్నారు.
తక్షణం అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రెవెన్యూ అధికారి ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడ వివాదాలతోనూ, అక్రమాలతోనూ సహవాసం చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతనిపై గతంలో రెవిన్యూ డివిజనల్ స్థాయి అధికారి విచారణ జరిపి బదిలీలు చేసినా కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా చక్రం తిప్పుడుతున్నాడని అంటున్నారు. పోలవరం పరిహారంలో అవకతవకలు జరగడంతో నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందులో నిజాలు వెలికితీసి రామారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు, గిరిజన నేతలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


