ప్రంపచానికి లభించిన జ్ఞాన సంపదే భగవద్గీత: ఆచార్య శతపతి
విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): ప్రపంచానికి లభించిన జ్ఞాన సంపదే భగవద్గీత అని తిరుపలి రాష్ట్రీయ సంసృత విద్యాపీఠ్ పూర్వ ఉపకులపతి ఆచార్య హరేక్రిష్ణ శతపతి అన్నారు. మంగళవారం సాయంత్రం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆచార్య కె.రామక్రిష్ణారావు ఎండోమెంట్ లెక్చర్లో’యోగా అండ్ మెడిటేషన్ పర్సీవ్డ్ ఇన్ భగవద్గీత’ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా హరేక్రిష్ణ శతపతి మాట్లాడుతూ భారతీయతలో భగవద్గీతలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. భగవద్గీత యోగశ్రాస్తాన్ని కలిగి ఉందన్నారు. ఉపనిషత్తుల సారంగా భగవద్గీత దర్శనమిస్తుందన్నారు. విశాస్వన్ని సంరక్షించే శక్తిగా భగవద్గీత ఉందన్నారు.
సంక్షిష్టత నుంచి ఆత్మస్థైర్యాన్ని అందించే శక్తిని భగవద్గీత వ్యక్తికి అందిస్తోందని ఉదాహరణలతో వివరించారు. భారతీయ యోగ విధానం శాస్త్రీయమైనదన్నారు. యోగాలను మానవుల నుంచి విడదీసి మాట్లాడలేమన్నారు. మనసును మార్పుచేసుకోగలిగే శక్తి యోగా వలన లభిస్తుందన్నారు. మనసును నియంత్రించే శక్తి యోగా ఇస్తుందన్నారు. స్తిరమైన ప్రగతికి , నెగెటివ్ ఆలోచనలను అధిగమించడానికి యోగా సహకరిస్తుందన్నారు. అనంతమైన, నాశముగాని ఆనందాన్ని యోగా విధానం అందిస్తుందన్నారు. శ్రీకృష్టుడు గీతోపదేశం చేస్తూ అర్జునుడిని యోగిగా మారాలని తద్వారా అన్ని సమస్యలను అధిమచించగలవని సూచించారన్నారు.
ఏయూ మాజీ వీసీ ఆచార్య కోనేరు రామక్రిష్ణారావు జన్మదినాన్ని నిర్వహించారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఆచార్య రామక్రిష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సైకాజీ, పారా సైకాలజీ రంగాలలో ప్రపంచ ఖ్యాతిని గాంచిన ఆచార్య రామక్రిష్ఱారావు ఏయూ ఆచార్యులు కావడం వర్సిటీకి గర్వకారణమన్నారు. ఆచార్య రామక్రిష్ణారావు ఆలోచనల నుంచి యోగా కేంద్రం ఆవిర్భావం జరిగిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, యోగా కేంద్రం విభాగాధిపతి ఆచార్య పి.నిర్మలా దేవి, ఆచార్య రమేష్ బాబు, సైకాలజీ ఆచార్యులు ఎం.వి.ఆర్ రాజు, ఆనందరావు, అశోక్ పెద్దసంఖ్యలో పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


