ప్రత్యేక హోదా కోసం ఉద్యమం: వైఎస్‌ఆర్‌ఎస్‌యూ
- 68 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 9 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ వై.యస్.ఆర్. స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రయూనివర్శిటీలోని ఖాళీప్లేట్లతో వినూతనంగా నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వై.యస్.ఆర్.ఎస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు మాట్లాడుతూ 2014 ఎన్నికలతో మ్యానిఫెస్టోలో తెలుగుదేశం, బి.జె.పి.లు విశాఖనగరం సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని ఈరోజు మభ్యపెట్టడ దారుణమన్నారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచుకోవాలని చూస్తున్నారన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు కేంద్రమంత్రిమండలిలో ఉన్న మంత్రులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈరోజు చంద్రబాబునాయుడుగారు కేంద్రమంత్రిమండలిలో ఉన్న మంత్రులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చంద్రబాబునాయుడుగారు ఓటుకునోటు కేసుకు భయపడి కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారన్నారు. నిజంగా చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి వుంటే బి.జె.పి.తో తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నిరుద్యోగులు బిక్షగాళ్ళగా మారిపోయే ప్రమాదం ఉంది. ఉత్తరాంధ్ర ఎం.పి.లు, ఎం.ఎల్.ఏలు. అధికారంలోనికి వస్తే విశాఖకు రైల్వే జోన్ తీసుకొస్తామని విఫలమయ్యారు.
రైల్వేజోన్‌ని తీసుకురాని ఉత్తరాంధ్ర ఎం.పి.లు, ఎం.ఎల్.ఏ.లను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.యస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, ఏ.యు. అధ్యక్షులు రాజ్‌కమల్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్ యాదవ్, విధ్యార్ధి నాయకులు ఆళ్ళస్వామి, బి.జోగారావు, అశోక్‌బాబు, పోలినాయుడు, చందు, కామేష్, రమణ, నాని, శంకర్ మరియు అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.


