ప్రత్యేక హోదా ప్లకార్డుతో వెండి గణనాథుడు
నెల్లూరు: వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ నెల్లూరుకు చెందిన సూక్ష్మ స్వర్ణకారుడు షేక్ ముసవ్వీర్ వెండి గణనాథుడికి సుందరరూపమిచ్చారు. ఏకదంతుడు ‘ప్రత్యేక హోదా’ కోరుతూ ప్రదర్శించే ప్లకార్డుతో తీర్చిదిద్దారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించాలంటే ప్రత్యేక హోదా అవసరమని గజాననుడికి ఈ రూపమిచ్చానన్నారు. మూడురోజులు శ్రమించి 1.5 మిల్లీగ్రాముల వెండితో 5 సెంటీమీటర్లు ఎత్తు, 3 సెంటీమీటర్లు వెడల్పుతో ఉన్న ఆదిదేవుడిని తీర్చిదిద్దానన్నారు. ప్రత్యేక హోదా ప్రసాదించేలా కేంద్రపాలకుల మనసులను మార్చాలని తాను వేడుకుంటున్నట్లు తెలిపారు.
Categories

Recent Posts

