ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంతెన?
- 112 Views
- wadminw
- October 3, 2016
- అంతర్జాతీయం
డ్యూజ్ వంతెన లేదా బైపన్‌జియాంగ్ చైనాలో నిర్మితమౌతున్న ప్రపంచంలోనే అతి పెద్ద వంతెన. దక్షిణ చైనాలోని బైపన్ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న బైపన్‌జియాంగ్ వంతెన ప్రాథమిక నిర్మాణం పూర్తయింది. నది రెండువైపుల ప్రాంతాన్ని కలుపుతూ వారధి తయారైంది. 2016 చివరి నాటికి దీన్ని పూర్తిచేసి వినియోగంలోకి తేనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరున్న ‘సి-దు’(1627 అడుగులు) కంటే ఇది 227 అడుగులు ఎక్కువ ఎత్తుంది.
బైపన్‌జియాంగ్ మొత్తం పొడవు 4,399.6 అడుగులు (1,341 మీటర్లు). గుయ్‌జో, యునాన్ రాష్ట్రాలను కలుపుతూ నిర్మిస్తున్న దీనివల్ల రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య సుమారు 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుంది. నిర్మాణానికి పట్టిన కాలం: 3 ఏళ్లు. నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు: 1000 మంది. మరోవైపు, భారత్ ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌కు దాని మిత్రదేశమైన చైనా అండగా నిలవడానికి సిద్ధపడుతోందా? పాక్‌పై భారత్ దూసిన ‘సింధు’జలాల అస్త్రానికి చైనా ‘బ్రహ్మా’స్త్రాన్ని అడ్డేసి కాపాడే ప్రయత్నం చేస్తోందా? తాజా పరిణామాలు చూస్తే ఈ అనుమానాలే తలెత్తుతున్నాయి.
చైనాలో పుట్టి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదీ జలాలకు అడ్టుకట్ట వేయనున్నట్లు ప్రకటించడమే దానికి కారణం. ఆసియాలో అన్ని రంగాల్లోనూ తనకు పోటీ వస్తున్న భారత్‌పై అక్కసు వెళ్లగక్కడానికి తన చిరకాల స్నేహితుడైన పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. టిబెట్‌లో బ్రహ్మపుత్ర (అక్కడ యార్లుంగ్ శాంగ్బో అని పిలుస్తారు)కు ప్రధాన ఉపనది అయిన ‘జియాబుకు’కు వచ్చే నీటిని చైనా నిలిపివేసింది. జిగేజ్ ప్రాంతంలో చేపడుతున్న భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
లాల్హో అని పిలిచే ఈ ప్రాజెక్టును 740 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 9,700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి ఝాంగ్ యాన్బావో తెలిపారు. బ్రహ్మపుత్ర నీటిని నిలిపివేయడం వల్ల భారత్, బంగ్లాదేశ్ వంటి దిగువనున్న నదీ పరివాహక దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటి ప్రభావం ఉంటుందన్నది ఇంకా ఇతమిత్థంగా తెలియడం లేదు. గత ఏడాది చైనా టిబెట్‌లోనే అతిపెద్ద జామ్ జల విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించినప్పుడే భారత్‌లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వీటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చైనా చెబుతూ వస్తోంది. తమ ఆనకట్టలేవీ నీటిని నిలిపివేసేలా ఉండవని.. విద్యుత్తు ఉత్పత్తి అవసరాలకే వాడుకుంటామని పేర్కొంది. నదిలో నీరు యథావిధిగా ప్రవహిస్తూనే ఉంటుందని చెబుతోంది. అత్యంత సున్నిత ప్రాంతాలుగా పేరొందిన హిమాలయ సానువుల్లో భారీ ఆనకట్టలు, జల విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో టిబెట్‌లోనే పెద్దదైన ఝామ్ విద్యుత్తు పథకం నిర్మాణం చేపట్టినప్పుడు కూడా భారత్ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది.
కాని యథావిధిగా చైనా దానిని పరిగణలోకి తీసుకోలేదు. తామెక్కడా నీటిని నిల్వ చేయడం లేదని, పారే నీటిని విద్యుత్తు ఉత్పత్తికి వాడుకుని తిరిగి కిందకు వదిలిపెట్టేస్తామని పేర్కొంది. కాని అడ్డుకట్ట ద్వారా నీటి పారుదల మీద నియంత్రణ ఏర్పరచుకోవడమే భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. ఉరీ ఉగ్రదాడుల అనంతరం సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని పునఃసమీక్షించడం ద్వారా పాక్ విషయంలో భారత్ పట్టు బిగిస్తుందన్న వార్తల నేపథ్యంలోనే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
సింధు జలాల విషయంలో భారత్ వైఖరి మారినట్లుగా వార్తలు వచ్చిన వెంటనే ఈనెల 27న చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘ఇటు భారత్, అటు పాకిస్థాన్‌లకు స్నేహపూర్వకమైన పొరుగు దేశంగా ఆ రెండు దేశాలకూ హితవు చెబుతున్నామని, అవి రెండూ చర్చల ద్వారా పరస్పర సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకుంటాయని ఆశిస్తున్నామని’ పేర్కొన్నారు. ‘ఉపఖండంలో శాంతిని నెలకొల్పడానికి, అభివృద్ధి, సుస్థిర సాధనకు ఆ రెండు దేశాలూ కృషి చేయాలని చెప్పడం’ విశేషం.
మొత్తం మీద భారత్ చైనాల మధ్య సంబంధాల్లో ఈ ప్రాజెక్టుల అంశం వివాదాస్పదంగా మారుతోంది. కాగా, చైనా ఆధ్వర్యంలోని దక్షిణ టిబెట్ బ్రహ్మపుత్రకు జన్మస్థలం. హిమాలయాల్లోని మానస సరోవర్ సమీపంలో కైలాసపర్వతం దిగువన పుట్టే ఈ నది అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్, అసోంలలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 2,900 కిలోమీటర్ల దూరం ప్రవహించే ఈ నదీ పరివాహకం అత్యంత సారవంతమైనది. సగటున సెకనుకు 19,300 ఘనపు మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఈ నది ఒక్కోచోట అత్యధికంగా 10 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. భారత్-చైనా మధ్య జల ఒప్పందాలేవీ లేవు.
2013 అక్టోబరులో మాత్రం సరిహద్దు నదుల విషయమై సహకారం బలపరుచుకునేలా రెండు దేశాలూ అవగాహన పత్రంపై సంతకాలు చేశాయి. బ్రహ్మపుత్ర, దాని ఉప నదులపై మరో మూడు ప్రాజెక్టులను కూడా నిర్మించనున్నట్లు చైనా 12వ పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. ఏ నదుల మీద నిర్మిస్తుందనే విషయం వెల్లడించడంలేదు. దాగు వద్ద 640 మెగావాట్లు, ఝాంగ్ము వద్ద 510 మె.వా., ఝైచా వద్ద 320 మెగావాట్ల్ల విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుల ప్రభావం భారత్‌పై పడుతుందని భారత ప్రభుత్వం గత మార్చిలోనే చైనా దృష్టికి తీసుకువెళ్లింది. జియాబుకుపై నిర్మిస్తున్న విద్యుదుత్పత్తి కేంద్రం సామర్థ్యం ఏడాదికి 25 లక్షల మెగావాట్లు.
మొత్తం 6 యూనిట్లు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జలవిద్యుత్తు కేంద్రం. జిగేజ్ ప్రాంతం భారత్‌లో సిక్కింకు సమీపంలో ఉంది. ఇక్కడి నుంచే బ్రహ్మపుత్ర అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. 2014 జూన్‌లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2019 నాటికి పూర్తవుతుందని చైనా చెబుతోంది.


