ప్రపంచ ఉగ్రవాదుల లిస్టులో జూనియర్ లాడెన్!
- 72 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
మొత్తానికి కాస్త ఆలస్యమయినా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఆల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్‌కు స్థానం దక్కింది. అమెరికా దళాల దాడిలో తండ్రిని కోల్పోయిన తర్వాత లాడెన్ కొడుకు ఉగ్రవాద కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉన్నప్పటికీ ఈమధ్య ఆల్ఖైదాలోని ఇతర నేతలు హంజాబిన్‌ను ఫోకస్ చేస్తూ దాడులకు దిగుతూ వస్తున్నారు. విషయాన్ని గమనిస్తూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హంజాబిన్‌ను ఆల్ ఖైదా సభ్యుడుగా ఆ సంస్థ నేత అల్ జవహరి 2015 ఆగస్టు 14న ప్రకటించాడు.
ఆ తర్వాత హంజాబిన్పై నిఘా పెట్టిన అమెరికా ఉగ్రవాద కార్యకలాపాల్లో అతను చురుకుగా పొల్గొంటున్నాడని నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1989లో జన్మించిన హంజాబిన్ వయసు ప్రస్తుతం 27 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికా రక్షణ, భద్రత కోసం హంజాబిన్తో లావాదేవీలన్నింటినీ నిషేధించింది. ఉగ్రవాదిగా తండ్రి వారసత్వాన్ని హంజాబిన్ కూడా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను నేవీ హతం చేసిన సంగతి తెలిసిందే.


