ప్రపంచ దేశాలలో ఉపాధ్యాయ దినోత్పవాలు…
- 107 Views
- wadminw
- September 4, 2016
- అంతర్జాతీయం
ఉపాధ్యాయ దినోత్సవం ఒక్క భారతదేశంలోనే కాదు… వివిధ పేర్లతో దాదాపు ప్రపంచ దేశాలన్నిటిలోనూ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారతదేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5వ తేదీన జరుపుకుంటాము. అయితే, ఆరోజు ప్రభుత్వ సెలవుదినం మాత్రం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం మాత్రమే. పాఠశాలలు యధావిధిగా కొనసాగి విద్యార్ధులు, అధ్యాపకులు ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మే 24న జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో అక్కడి ఉత్తమ అధ్యాపకులను సత్కరిస్తారు. అల్బేనియాలో ఫెస్టాఅ ఎ విూసుయెసిట్ పేరిట మార్చి 7న ఈ ఉత్సవాలు జరుగుతాయి.
1867లో మొదటి పాఠశాల స్థాపించి మొదటిసారిగా పాఠాలు బోధించిన సందర్భంగా అక్కడీ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక అర్జెంటీనాలో డయా డెల్ మాస్ట్రో పేరుతో సెప్టెంబరు 11న డొమింగో ఫాస్టినో సర్మియెంటో గౌరవార్థం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం పేరిట అక్టోబరు ఆఖరు శుక్రవారం నిర్వహిస్తారు. అజర్ బైజాన్ దేశంలో అక్టోబరు 5న, బ్రెజిల్ దేశంలో డయా డో ప్రొఫెసర్ పేరిట అక్టోబర్ 15న, చిలీలో డయా డెల్ ప్రొఫెసర్ పేరిట అక్టోబర్ 16న, చైనాలో సెప్టెంబర్ 10న, కొలంబియాలో డయా డెల్ ప్రొఫెసర్ పేరిట మే 15న, క్రొయేషియాలో డాఅన్ ఉసిటెల్జా పేరుతో అక్టోబరు 5న ఉత్సవం నిర్వహిస్తారు. ఆరోజున క్రొయేషియాలో పాఠశాలలకు సెలవు. తరగతులు జరుగవు. ఇక చెక్ రిపబ్లిక్ దేశంలో డెన్ ఉసీటెలు పేరిట మార్చి 28న జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈక్వెడార్‌లో ఏప్రిల్ 13న, ఎల్‌సాల్వడార్‌లో జూన్ 22న జాతీయ సెలవుగా పరిగణిస్తారు.
హాంకాంగ్ దేశంలో సెప్టెంబర్ 10న, హంగెరీలో జూన్ మొదటి శనివారం, ఇండోనేషియాలో హరి గురు పేరిట నవంబర్ 25న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇరాన్లో మే 2 (ఇరానియన్ కేలండర్ ప్రకారం ఓర్దె బెహిష్త్ 12వ తేదీ)న ర్తజా మతహరి సంస్మణార్థం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటారు. జమైకాలో మే 6 లేదా మే నెల మొదటి బుధవారం, లిథువేనియాలో అక్టోబర్ 5న, లెబనాన్‌లో ఈద్ అల్ ముఅలిమ్ పేరిట మార్చి 3న, మలేషియాలో హరి గురు పేరుతో మే 16న, మెక్సికోలో డయా డెల్ మాస్ట్రో పేరిట మే 15న, మంగోలియాలో ఫిబ్రవరి మొదటి వారాంతం, పాకిస్తాన్లో అక్టోబర్ 5న, పనామాలో డిసెంబర్ 1న మాన్యుయెల్ జోసే హుర్తాదో సంస్మణార్థం ఉపాధ్యాయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పరాగ్వేలో డయా డెల్ మాస్ట్రో పేరుతో ఏప్రిల్ 30న, పెరూలో డయా డెల్ మాస్ట్రో పేరిట జూలై 6న డోన్ జోసే డె సాన్ మార్టిన్ గౌరవార్థం నిర్వహిస్తారు. ఫిలిప్పైన్స్ దేశంలో అరాంగ్ మగా గురో పేరిట అక్టోబర్ 5న రాష్ట్రపతి అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఉపాధ్యాయులను సత్కరిస్తారు. పోలండులో అక్టోబర్ 14న, రష్యాలో అక్టోబర్ 5న, సింగపూర్ దేశంలో సెప్టెంబర్ 1, స్లొవేకియాలో మార్చి 28న జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినోత్సవ గౌరవార్థం నిర్వహిస్తారు. దక్షిణ కొరియాలో మే 15న, రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)లో సెప్టెంబర్ 28న, థాయిలాండ్‌లో జనవరి 16న, టర్కీలో నవంబర్ 24న ముస్తఫా కమాల్ అతాతుర్క్ను టర్కీవాసులు ప్రధాన ఉపాధ్యాయునిగా భావిస్తారు.
యునైటెడ్ స్టేట్స్ దేశంలో మే మొదటి వారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వియత్నాంలో నవంబర్ 20న వియత్నావిూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో రోజు నిర్వహించే ఉపాధ్యాయ ఉత్సవాలకు ప్రత్యేకత చోటుచేసుకుంది. ప్రపంచ దేశాలలో అత్యధిక దేశాలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజైన అక్టోబర్ 5వ తేదీనే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయించారు.


