ప్రభుత్వ ఖర్చుతోనే రైతులకు విద్యుత్ కనెక్షన్లు
- 85 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
హైదరాబాద్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): వ్యవసాయ విద్యుత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసిన రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే రైతులందరికీ కనెక్షన్లు అందింస్తామని ఆయన ప్రకటించారు. ఐదేళ్లుగా రైతులు విద్యుత్ కనెక్షన్లు కోసం ఎదురుచూస్తున్నారని, 97వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు.
‘‘రానున్న 7 నెలల్లోపు విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియ ముగించాలి. ప్రజాప్రతినిధుల సిఫారసు లేకుండా కనెక్షన్లు ఇస్తేనే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చ’’ అని అధికారులకు ఆయన తెలిపారు. రబీలో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. రూ.2450 కోట్లతో కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని కేసీఆర్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కనెక్షన్ల మంజూరులో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇప్పటివరకు 97 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.600 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తనకు తెలిపారని సీఎం వివరించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వ నిధులతోనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి, విద్యుత్ కనెక్షన్ల కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
రబీలో రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మరోవైపు, తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రీయంబర్స్మెంట్పై ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలో మంగళవారం మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరగడం లేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
నవంబర్ 26లోగా ఫీజు బకాయిలు చెల్లించకపోతే లక్షల మంది విద్యార్థులతో సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇటువంటి పరిపాలన ఏ రాష్ట్రంలోనూ చూడలేదని వ్యాఖ్యానించారు. అనంతరం తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి బతుకమ్మ పేరుతో రూ. కోట్లు ఖర్చుచేసి బిడ్డను విదేశాలకు పంపించాడని, వచ్చే యేడాది బతుకమ్మ ఆడేందుకు చంద్ర మండలానికి పంపుతారేమోనని ఎద్దేవా చేశారు. పేదల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వమని దుయ్యబట్టారు.
అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే భయంతో వాస్తు మార్పిడి పేరుతో సచివాలయం, ఇల్లు మారుస్తున్నారని విమర్శించారు. ఫీజు రియాంబర్స్మెంట్ చెల్లించకపోతే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెదేపా నాయకులు మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, ఎల్బీ నగర్ తెదేపా సమన్వయకర్త రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్లోకి హెచ్వీడ్యూటీ కాంక్రిల్ హెచ్డీ సిమెంట్
హైదరాబాద్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): అధికబలం, వేగవంతమైన అమరికలతో అత్యుత్తమ నాణ్యత కలిగి ఆరు రకాల దృడత్వం కలిగిన హెచ్‌వి డ్యూటీ కాంక్రిల్ హెచ్డి సిమెంట్‌ను జె.ఎస్.డబ్ల్యు సిమెంట్ హైదరాబాద్ మార్కెట్‌కు విడుదల చేసింది. ఈ సందర్భంగా జె.ఎస్.డబ్లు సంస్థ ఎండి పార్ధ జిందాల్ మాట్లాడుతూ, సాధారణ సిమెంట్లతో పోల్చితే నిర్మాణ రంగం పనులకు దీర్ఘకాల మన్నికను అందిస్తుందన్నారు. పచ్చదనం పరిడవిల్లే పర్యావరణం నిర్వహనా అవశ్యకతను అర్ధం చేసుకున్న తమ సంస్థ వినూత్నమైన గ్రీన్ ప్రోడక్షన్ను రూపొందించిందని చెప్పారు. దీనికి కెమికల్ దాడులను సైతం అడ్డుకునే నిలిచే శక్తి ఉందన్నారు. కాంక్రిట్ హెచ్డి విన్నూతమైన సిమెంట్ ప్రత్యేకంగా కాంక్రిట్ ఆదారిత కన్స్టక్షన్ అవసరాలను తీర్చే రీతిలో దీనిని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఇది అసాధారణ రీతిలో శ్రీష్రు బలంతో పాటు వేగవంతమైన సెట్టింగ్‌ను అందిస్తుందన్నారు. తమ పరిధిని విస్తరించడంతోపాటు ఎదో కత్తదనాన్ని అందిస్తునే సమాజానికి ప్రయోజనం కలుగాలన్నదే తమ అభిమతమన్నారు.
జీహెచ్ఎంసీలో ముమ్మరంగా పేపర్ బ్లాక్ రోడ్ల నిర్మాణం
హైదరాబాద్, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): భారీ వర్షాలకు కూడా నగరంలోని రోడ్లు దెబ్బతినకుండా ఉండడానికి ఎంపిక చేసిన రహదారులలో పేపర్ బ్లాక్ రోడ్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ ముమ్మరంగా చేపట్టింది. నగరంలో కురిసే చిన్న వర్షాలకు నీరు నిలవడం ద్వారా తరచు పాడుతున్నాయి. ఇలా తరచుగా మరమ్మతులకు గురయ్యే రోడ్లు ప్రధానంగా 45 ఉన్నాయని జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ 45 ప్రధాన రహదారులలో బిటీ రోడ్లు వేయడం, వర్షాలకు ఇవి దెబ్బతినడం తిరిగి పునరునిర్మించం వల్ల జీహెచ్ఎంసీ ఆర్థికంగా నష్టం కలుగడంతో పాటు ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా బిటీ రోడ్లకు బదులు పేపర్ బ్లాక్ రహదారులను చేపట్టింది. ఇటీవల కురిసన భారీ వరాషలకు దెబ్బతిన్న రోడ్ల మరమత్తులు, నిర్మాణాలను చేపట్టడానికి రూ. 75 కోట్లతో పనులు జీహెచ్ఎంసి చేపట్టింది. మొత్తం 489 రోడ్ల నిర్మాణ పనుల్లో 66 కోట్ల రూపాయల విషయంలో 399 బిటీ రోడ్ల నిర్మాణం 7 కోట్ల 30 లక్షల వ్యయంతో 75 సిసిరోడ్లు, కోటి 40 లక్షల రూపాయల వ్యయంతో పేపర్ బ్లాక్‌ల నిర్మాణాలను నిర్మిస్తోంది. ముఖ్యంగా ఖైరరాతాబాద్ కేసిపి జంక్షన్, రాంనగర్ ఫిష్ మార్కెట్, శ్రీనగర్ కాలనీ మొయిన్‌రోడ్, సత్యసాయి నిగమానిగం, ఫిలింనగర్ రోడ్ నెంబర్ 87, జూబ్లిహిల్స్ రోడ్ నెం. 32, రాజ్‌భవన్ రోడ్ జంక్షన్, ముగల్కా నాలా హఫీజ్‌పేట మెయిన్‌రోడ్ తదిరత 45 రోడ్లు చిన్న వర్షానికే నీటి నిల్వతో బిటీ రోడ్లు దెబ్బతిన గుంతలు ఏర్పడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని గుర్తించారు. ఈ రోడ్లలో పేపర్ బ్లాక్‌లతో రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే ఈ మార్గాల్లో ట్రాపిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగే అవకాశం ఉంది.


