ప్రాచీన హస్తకళలకు మరింత ప్రోత్సాహం: ఎమ్మెల్యే బడేటి
- 106 Views
- wadminw
- January 4, 2017
- Home Slider స్థానికం
ప్రాచీన హస్తకళలను ప్రోత్సహించి వివిధ వృత్తులపై ఆధారపడి జీవించే వారి జీవన స్ధితిగతులను మెరుగుపరుస్తామని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. హస్తకళల అభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో ఏలూరు టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హస్తకళల ఉత్పత్తుల విక్రయ ఎ గ్జిబిషన్ను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా బడేటి బుజ్జి మాట్లాడుతూ తంగెళ్లమూడి, శనివారపుపేట ప్రాంతాలలో తయారయ్యే తివాచీలు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయని అటువంటి తివారీ పరిశ్రమపై ఆధారపడి జీవించే పేదలకు చేయూత అందించి వారి ఉత్పత్తులు హస్తకళల సంస్ధ ద్వారా అందించి విక్రయించేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీ బడేటి బుజ్జి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ శ్రీ పాలి ప్రసాద్‌ను కోరారు. పూర్వకాలం తివాచీలకు ఏలూరు ఎంతో ప్రసిద్ధి చెందిందని వేలాదిమంది ఈపరిశ్రమపై ఆధారపడి జీవించే వారని అయితే సరైన ఆదరణ లేక రానురాను తివాచీ పరిశ్రమ కుంటుపడిందని శ్రీ పాలి ప్రసాద్ ఈవిషయంలో శ్రద్ధ తీసుకుని తివాచీ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని శ్రీ బడేటి బుజ్జి కోరారు.
హస్తకళల అభివృద్ధి సంస్ధ విక్రయించే వస్తువులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని నాణ్యమైన చేనేత ఉత్పత్తులు, వివిధ రకాల బొమ్మలు, వస్తువులు కొనుగోలు చేయడానికి హేలాపురి ప్రజలు ముందుంటారని అందుకే ఏలూరులో శాశ్వతంగా హస్తకళల బజార్‌ను ఏర్పాటు చేయాలని శ్రీ బడేటి బుజ్జి పాలిప్రసాద్ను కోరారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వివిధ రకాల హస్తకళల వస్తువులను ఖాదీ ఉత్పత్తులను శ్రీ బడేటి బుజ్జి పరిశీలించారు. ఈకార్యక్రమంలోరాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్ధ ఛైర్మన్ శ్రీ పాలి ప్రసాద్, ఏలూరు మేయరు శ్రీమతి షేక్ నూర్జహాన్, ఎ మ్మెల్సీ శ్రీ రాము సూర్యారావు, ఎ ఎ ంసి ఛైర్మన్ శ్రీ కూరెళ్ల రామప్రసాద్, కార్పోరేషన్ విప్ శ్రీ గూడవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


