ప్రాణాలు కాపాడడంతో పాటు ఆస్తినష్టం నివారణ
కాకినాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ప్రాణ, ఆస్తి, నష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్రముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు కాపాడవలసిన భాద్యత ఉందని, జిల్లా స్థాయి కంట్రోలు రూమ్ నుండి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ డివిజనలలో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్‌ల నుండి ఆర్.డిఓలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
చెరువులు, స్లూయిజ్‌లు పరిశీలించాలని గండ్లు పడకుండా చూడాలని, గేట్లు కండేషన్లో ఉంచి ఎక్కడ ఎటువంటి సమస్య రాకూడదని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని, వర్షాల వలన ఎక్కడైనా నష్టం సంభవిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలపాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరేన్స్లో పంచాయితీ రాజ్ ఎస్.ఇ వెంకటేశ్వరరావు, ఆర్ డబ్ల్యూఎస్.ఇ రాజేశ్వరరావు తదితర ధికారులు పాల్గొన్నారు.


