బయటపడిన హీరో నిఖిల్ స్వరూపం
యంగ్ హీరోలలో నిఖిల్ నటించే మూవీలు చాలా భిన్నంగా ఉంటాయి. తను ఎంపిక చేసుకునే కథలు.రెగ్యులర్ స్టోరీలకి భిన్నంగా ఉంటాయి. కథల విషయంలో హీరో నిఖిల్‌కి ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. అందుకే చాలా మంది యంగ్ హీరోలు కథల విషయంలో కన్ఫ్యూజన్గా ఉంటే హీరో నిఖిల్ సలహాని తీసుకుంటున్నారు. ఆ విధంగా గతంలో నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా నటించగా కార్తికేయ మూవీ మంచి సక్సెస్‌ని సాధించింది. ఈ మూవీకి దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటి ఇప్పుడు మరోసారి ఈ మూవీకి సీక్సెల్ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. కార్తికేయ సినిమా 2014లో విడుదలై, హీరో నిఖిల్ కెరీర్ ఏ విధంగా సహాపడిందో అందరికీ తెలిసిన విషయమే.
అయితే ఎప్పుడో ఈ మూవీకి సీక్వెల్ రావాల్సి ఉండగా ఇప్పటి వరకూ అది ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందని అందరకూ అనుకుంటుండగా తాజాగా కార్తికేయకు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, దర్శకుడు చందూ మొండేటితో కార్తికేయ 2కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని నిఖిల్ చెప్పుకొచ్చారు. మొన్నటి వరకూ కార్తికేయ మూవీపై ఎటువుంటి కామెంట్స్ చేయని నిఖిల్ ఒక్కసారిగా కార్తికేయ మూవీకి సీక్వెల్ ప్రాసెస్‌లో ఉందని తన ఆలోచన స్వరూపాన్ని బయటపెట్టాడు.
దీంతో 2017లో కార్తికేయ సీక్వెల్ బాక్సాపీస్ వద్ద సందడి చేయనుందని అంటున్నారు. మొత్తంగా కార్తికేయ సీక్వెల్లో నిఖిల్ ప్రత్యేకమైన ఆసక్తిలో ఉన్నారనే విషయం మాత్రం స్పష్టం అయింది. ప్రస్తుతం నిఖిల్ రెండు సినిమాలతో బిజిగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తరవాత కార్తికేయ సీక్వెల్‌ని సెట్స్ మీదకు తీసుకువచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్స్ చాలా మంది నటించారు. బాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న చాలా మంది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించిన వాళ్ళే.
అయితే సీనియారిటి ఉన్న బిటౌన్ గ్లామర్ హీరోయిన్స్ ఇప్పుడు మళ్ళీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీవైపు చూస్తున్నారు. అందులో భాగంగా ఒకప్పుడు టాలీవుడ్లో నాగార్జున సరసన నటించిన హీరోయిన్ ఇషా కొప్పికర్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ సినిమాలో చేసేందుకు ఆసక్తి చూపుతుంది. అయితే ఈ బ్యూటీ తిరిగి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేందుకు రెడీ అవుతున్న తరుణంలో ఈ బ్యూటీ నాగార్జున విషయంలో చిన్నబోయిందని అంటున్నారు. ఫిల్మ్ నగర్లో దీనికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వీటి వివరాలను చూస్తే నిఖిల్ సిద్దార్థ స్వామి రారా హిట్ కాంబినేషన్‌ని మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్లో నిఖిల్ మూవీకి రెడీ అయ్యారు. ఈ సినిమాకి కేశవ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రంలో ఒకప్పుడు నాగార్జున సరసన హీరోయిన్గా నటించిన ఇషా కొప్పికర్ మళ్ళీ ఈ చిత్రంలో కనిపిస్తుంది. 1998లో నాగార్జున హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కించిన చంద్రలేఖ సినిమాలో ఇషా కొప్పికర్ హీరోయిన్. 2001లో వెంకటేష్ సినిమా ప్రేమతో రా తన చివరి చిత్రం.
అయితే ఇషా కొప్పికర్ తెలుగులో రీ ఎంట్రి ఇస్తున్న సమయంలో నాగార్జున అప్ కమింగ్‌లో ఆఫర్‌ని అడిగిందట. ఇందుకు నాగార్జున ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవటంతో ఈ బ్యూటీ హర్ట్ అయిందని అంటున్నారు. అయితే నాగార్జున ప్రస్తుతం భక్తి చిత్రంలో నటిస్తున్నారు కాబట్టి ఇషా కొప్పికర్తో ఎటువంటి సంభాషణలు జరపటం లేదని కొందరు అంటున్నారు. ఈ గ్యాప్ కారణంగా నాగార్జున మీద ఈ బ్యూటీ అలిగి ఉండొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్ సినిమాలో ఇషా కొప్పికర్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందని అంటున్నారు.


