బహిరంగ మలవిసర్జనలేని గ్రామంగా దానవాయిపేట
కాకినాడ, సెప్టెంబర్ 4 (న్యూస్‌టైమ్): తూర్ప గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకోవడం ద్వారా వచ్చే అక్టోబరు 31వతేదీ నాటికి బహిరంగ మలవిసర్డన లేని గ్రామంగా దానవాయిపేటను ప్రకటించాలని జిల్లా కలక్టర్ హెచ్.అరుణ్ కుమార్ అధికారులను,గ్రామస్తులను కోరారు. దానవాయిపేటను ఆయన ఆకర్షణీయ గ్రామం(స్మార్ట్ విలేజ్)క్రింద దత్తత తీసుకున్న సందర్భంగాను,పల్లెక్రాంతి కార్యక్రమంలో భాగంగా గ్రామ అవసరాల ప్రాధమిక పరిశీలనకై ఆగ్రామాన్ని సందర్శించి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం,అంగన్వాడీ కేంద్రం,చౌకధరల దుకాణం, ఉన్నత పాఠశాల మొదలైనవి పరిశీలించి వాటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ప్రజలను ఆరాతీశారు.
అనంతరం జరిగిన సభలో కలక్టర్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో జిల్లాలోని అన్ని గ్రామాలను ధాతలు,వివిధ సంస్థల సహకారంతో ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని దానిలో భాగంగానే తాను వెనుకబడిన,మత్స్యకార గ్రామమైన దానవాయిపేట గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగిందని అన్నారు.ఆకర్షణీయ గ్రామం అంటే ప్రధానంగా 20అంశాలకు సంబంధించి మెరుగైన అభివృద్ధి సాధించడం ద్వారా ఆగ్రామం అన్ని అవిధాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా విద్య,వైద్యం,మహిళా శిశు సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, మాతృ,శిశు మరణాలు పూర్తిగా నివారించడం,ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరగుదొడ్డి ఏర్పాటు ద్వారా బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం వంటి అంశాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ఆదర్శ గ్రామం ముఖ్య లక్ష్యమని చెప్పారు.
నేడు వ్యక్తిగత మరుగుదొడ్డి కమ్ బాత్రూమ్కు అయితే ప్రభుత్వం 15వేల రూ.లు,కేవలం మరుగుదొడ్డికైతే 12వేల రూ.లు సహాయం అందిస్తోందని అన్నారు. ఆదర్శ గ్రామానికి సంబంధించి ముందుగా ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగు దొడ్డిని నిర్మించుకుని బహిరంగ మల విసర్జనను పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ణప్తి చేశారు. ఈగ్రామంలో సుమారు 1000 కుటుంబాలుండగా వాటిలో ఇంకా 395 ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని వాటన్నిటికీ వచ్చే అక్టోబరు 31లోగా ప్రభుత్వ పరంగాను,స్థానిక హేచరీ యజమానులుచే సిఎస్ఆర్ క్రింద మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుని బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా ప్రకటించి ఊరు ముఖద్వారం వద్ద ఆవిధమైన బోర్డును ఏర్పాటు స్థానిక సర్పంచ్, అధికారులు చొరవ తీసుకోవాలని కలక్టర్ సూచించారు.
రైతులకు సంబంధించిన భూమి సమస్యలను పరిష్కరించేందుకు మీఇంటికి మీభూమి కార్యక్రమం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటి వరకూ 95వేల ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు కలక్టర్ తెలిపారు.ఇందుకు సంబంధించి ఎవరికీ ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.అంతకు ముందు ఆగ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం,అంగన్వాడీ కేంద్రం,చొకధరల దుకాణం,ప్రాధమిక,ఉన్నత పాఠశాలలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై గ్రామలస్తులను ఆరాతీశారు.వాటి పనితీరు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అంగన్వాడీ కేంద్రం ప్రక్కన చెత్తకుప్ప ఉండడాన్ని ఆయన గమనించి ఇక్కడ చెత్తవేస్తుంటే మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అంగన్వాడీ వర్కర్‌ను ప్రశించారు.
అలాగే గ్రామంలో 300మంది మత్స్యకారులకు చేపల వేట నిషేధానికి సంబంధించిన పరిహారం చెల్లించాల్సి ఉండగా 168మందే అర్హులని ఏప్రాతిపదికన గుర్తించారని మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని కలక్టర్ నిలదీశి దానిపై వ్రాతపూర్వక నివేదిక ఇవ్వాలని ఈవిషయంలో లోపాలుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రోడ్లు అక్రమల కారణంగా ప్రమాదాలు జరుతున్నాయని గ్రాస్తులు కలక్టర్ దృష్టికి తేగా పరిశీలించి ఆక్రమణలుంటే తలొగించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్‌ను ఆయన ఆదేశించారు. దానవాయిపేట గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కలక్టర్ వరాల జల్లు. దానవాయిపేటను గ్రామాన్ని అన్ని విధాలా ఆదర్శవంతమైన గ్రామంగా అభివృద్ధి చేసేందుకు ఒక సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాలని సర్పంచ్,ఎండిఓలను కలక్టర్ అరుణ్ కుమార్ ఆదేశించారు.
గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రానికి భవనం నిర్మించడం జరుగుతుందని,మత్స్యకారులకు సంబంధించి 2ఎకారల స్థలం ఉందని అక్కడ మత్స్యకారుల ఉత్పత్తులు నిల్వచేసుకోవడం,ఇతర అవసరాలకు ఫిష్ ప్లాట్ప్లారమ్,షెడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.గ్రామంలోని విద్యుత్ తీగలను సరిచేయించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఉన్నత పాఠశాలకు ఉపాధిహామీ పధకం అనుసంధానంతో ప్రహారీగోడ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదేవిధంగా గ్రామంలో ఇంకా అవసరం ఉన్న వీధులకు సిసి రోడ్లు నిర్మించేందుకు వీలుగా 14వ ఆర్ధిక సంఘం నిధులుతో చర్యలు తీసుకుంటామని కలక్టర్ పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రం పనితీరు మెరుగు పర్చేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలని పెంచేందుకు ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కొత్తగా 19వేల ఫించన్లు మంజూరు-జన్మభూమి కమిటీల ద్వారా లబ్దిదారుల ఎంపికఃకలక్టర్. జిల్లాలో నియోజకవర్గానికి 1000వంతున 19వేల కొత్త ఫించన్లు మంజూరు అయ్యాయని వాటికి అవసరమైన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను జన్మభూమి కమిటీల ద్వారా చేపట్టడం జరుగు తుందని జిల్లా కలక్టర్ హెచ్.అరుణ్ కుమార్ వెల్లడించారు.కొత్తగా మంజూరైన ఫించన్లు ప్రతి గ్రామానికి 15నుండి 20వరకూ వచ్చే అవకాశం ఉందని కావున నిజమైన లబ్దిదారులకు ఆఫించన్లు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తొండంగి ఎండిఓ బి.శివమూర్తి,తహసిల్దార్ టివి సూర్యనారాయణ,గ్రామ సర్పంచ్ హరిబాబు,ఇంకా వివిధ శాఖల మండల,గ్రామ స్థాయి అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


