బాలయ్య అభిమాని ప్రశ్నతో ఇరకాటంలో శివ!
జనతా గ్యారేజ్ మూవీని ప్రమోట్ చేస్తూ నిన్న రాత్రి ఒక ఛానల్ ప్రసారం చేసిన లైవ్ కార్యక్రమంలో ఒక ప్రవాస తెలుగు కాలర్ అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడుతూ కొరటాల శివకు వేసిన ప్రశ్నకు కొరటాల షాక్ అవడమే కాకుండా ఆ ప్రశ్నకు సమాధనం ఇవ్వడానికి కొరటాల చాలా ఇబ్బంది పడ్డాడు. జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ జూనియర్ కాంబినేషన్ గురించి ఆ ఎన్ఆర్ఐ కాలర్ మాట్లాడుతూ మోహన్ లాల్ స్థానంలో బాలకృష్ణ ఉంటే బాగుంటుంది కదా అని ప్రశ్నించి ఆ కాలర్ కొరటాలను ఇరకాటంలో పెట్టాడు.
అంతేకాదు మోహన్ లాల్ స్థానంలో బాలయ్య ఈ సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల సినిమాగా మారి ఉండేది అని ఆ కాలర్ అభిప్రాయపడటంతో ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొరటాల కొద్దిగా తికమకపడ్డాడు. ఒకవైపు జనతా గ్యారేజ్ సినిమాకు బెనిఫిట్ షోలు తరువాత ఆ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంలో నందమూరి అభిమానులలోని ఒక వర్గం క్రియాశీలకంగా వ్యహరించింది అని గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో ఏకంగా ఒక ఎన్.ఆర్.ఐ. కాలర్ బాలకృష్ణను ఈ సినిమాలో మోహన్ స్థానంలో ఎందుకు పెట్టుకోవాలి అని అనిపించలేదు అని అడగడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ ప్రశ్నను బట్టి నందమూరి అభిమానులలోని ఒక వర్గం వారు బాలకృష్ణ జూనియర్ ఒక సినిమాలో కలిసి నటిస్తే చూడాలని ఎంత ఆశ పడుతున్నారో ఈ ప్రశ్నను బట్టి అర్ధం అవుతుంది.
జూనియర్ బాలయ్య ఈ వాస్తవాన్ని గ్రహించి త్వరలో అటువంటి సాహసం చేయగలిగితే అది నిజంగానే నందమూరి అభిమానులకు పండుగే. ఈ వార్తలు ఇలా ఉండగా జనతా గ్యారేజ్ అమెరికాలో తెలుగు రాష్ట్రాల టాక్‌తో సంబంధం లేకుండా దుమ్ము దులుపుతోంది. నిన్న ముగిసిన శనివారంతో జనతా గ్యారేజ్ ఓవర్ సీస్ కలక్షన్స్ మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటి పోయి జూనియర్‌ను మరోసారి మిలియన్ డాలర్స్ క్లబ్లో చేర్చి జూనియర్‌కు హ్యాట్రిక్ రికార్డు అందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో మహేష్‌బాబు తరువాత ఓవర్సీస్ ప్రేక్షకులలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోగా జూనియర్ రెండవ స్థానాన్ని ఆక్రమించాడు.
ఈ సినిమా ఓవర్సీస్ కలక్షన్స్కు సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం జనతా గ్యారేజ్‌కి అప్పుడే 1.5 మిలియన్ డాలర్స్ కలక్షన్స్ రావడంతో ఈ వీకెండ్‌కు ఈ సినిమాకు సంబంధించి టోటల్ కలక్షన్స్ 2 మిలియన్ డాలర్స్ మార్క్‌ను చేరుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జనతా గ్యారేజ్‌కి డివైడ్ టాక్ వచ్చినా ఎ సెంటర్లలో ఈ సినిమా కలక్షన్స్ బాగానే ఉన్నా బిసి సెంటర్లలో మాత్రం ఈ సినిమా కలక్షన్స్కు సంబంధించి స్పష్టమైన డ్రాప్ కనిపించింది అని విశ్లేషకులు అంటున్నారు. దీనితో ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు ఎంతోకొంత నష్టం తీరుతుందని అంటున్నారు. అయితే అసలు విషయం ఈ వినాయక చవితి తరువాత వచ్చే మంగళవారం రోజున ఈ సినిమా అసలు రూపం బయటపడుతుంది అని అంటున్నారు.


