బాహుబలిగా మాసంగా మారిపోతున్న అక్టోబర్!
గత కొంత కాలంగా మీడియాకు చాలా దూరంగా ఉన్న రాజమౌళి ఎట్టకేలకు మరోమారు మీడియా ముందుకు వచ్చి బాహుబలి 2కు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకోవడమే కాకుండా మరో సస్పెన్స్‌కు తెర తీసాడు రాజమౌళి. అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించబోతున్నామని చెపుతూ అయితే అది ప్రభాస్ పెళ్ళి న్యూస్ కాని మరో విషయం విషయం కాని కాదు అంటూ అది ఎవ్వరూ ఊహించలేని సస్పెన్స్ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి. అంతేకాదు అక్టోబర్ నెలంతా బాహుబలి 2 నెలగా మారబోతోంది అని అంటూ అక్టోబర్ 22న బాహుబలి 2 ఫస్ట్ లుక్ అదేవిధంగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 23న బాహుబలి 2 మేకింగ్ వీడియో విడుదల చేయబోతున్నట్లు ప్రభాస్ అభిమానులకు జోష్‌ను ఇచ్చే వార్తలను లీక్ చేసాడు జక్కన్న.
మరోవైపు, తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలుగా ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన పెద్ద కుమారుడు డి సురేష్ మాత్రం నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు. ఇక వెంకటేష్ వారసుడిగా సురేష్ తనయుడు రానా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రానా నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించక పోయినా మనోడికి పాపులారిటీ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న రానా గత సంవత్సరం ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇక రానా వయసు వారంతా పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కంటున్నారు.
కానీ మనోడికి మాత్రం ఇప్పటి వరకు ఆ ఆలోచనలోనే లేనట్లు కనిపిస్తున్నారు. తాజాగా రానా షాకిస్తాడని నాగచైతన్య కూడా అంటున్నాడు. గతంలో రానా తండ్రి అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా రానాకు పెళ్ళి చేయాలనీ అనుకుంటున్నాను కానీ వాడు నాకు షాక్ ఇచ్చే లాగే ఉన్నాడు అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే మాట రానాకు బాగా దగ్గరైన నాగ చైతన్య కూడా అనడంతో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే రానా పలువురు భామలతో రొమాన్స్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు వస్తున్నాయి.
అంతే కాదు గతంలో త్రిష, శ్రియ లాంటి హీరోయిన్లతో బహిరంగానే రొమాన్స్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ రానా ఈ విషయాన్ని కొట్టి పడేశారు. త్వరలో బాహుబలి చిత్రం షూటింగ్ పూర్తి కాగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రానా ఎప్పుడు షాక్ ఇవ్వనున్నాడో అని టాలీవుడ్ వర్గాల భోగట్టా.


