బిచ్చగాడి హీరోయిన్ రహస్య పెళ్లి!
తెలుగు ఇండస్ట్రీలో తమిళ రిమేక్ చిత్రాలు, డబ్బింగ్ చిత్రాలు యావరేజ్‌గా ఆడటం మనకు తెలుసు. ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే కాస్త కలెక్షన్ల పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకుంటాయి. ఈ మధ్య కాలంలో ఓ సినిమా తెలుగు డైరెక్ట్ సినిమాల కన్నా విపరీతమైన కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 20 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి షెభాష్ అనిపించుకుంది. కంటెంట్ బాగుంటే ఏ చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఉదాహారణగా నిలిచింది. ఆ చిత్రమే ‘బిచ్చగాడు’. పెద్ద హీరో కాకపోయినా రెండు మూడు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాని హీరో విజయ్ ఆంటోనీకి ఒక్కసారే ఇమేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సాట్నా టైటస్ కూడా అద్భుతమైన నటన ప్రదర్శించింది. తాజాగా ఈ అమ్మడు రహస్య వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగులో బిచ్చగాడుగా వచ్చిన ఈ చిత్రానికి మాతృక తమిళ పిచ్చై కారన్. కాగా తమిళనాట ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన వాళ్ళలో కార్తీ ఒకరు. ఆ సమయంలోనే కార్తీకి ఈ అమ్మడు పరిచయం కావడం అది కాస్త ప్రేమ వివాహానికి దారి తీయడంతో ఇద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఇది జరిగి నెల రోజుల తర్వాత విషయం కాస్త బయటకు పొక్కడంతో దీనిపై ఏమీ స్పందించలేదట ఈ అమ్మడు. రహస్య వివాహం అనేది ఎంతో కాలం దాచలేరు కాబట్టి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఇద్దరి రహస్య వివాహం వెలుగులోకి రావడంతో కోలీవుడ్ ఒక్కసారే షాక్‌కి గురయ్యారట. మరోవైపు, బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నా హిట్ మాత్రం దక్కలేదు. ఇక అప్పటినుండి నిన్న మొన్నటి బ్రూస్ లీ దాకా సినిమాలో కృతి ఉంటే సినిమా ఫట్ అన్నట్టే.
అయితే ఈ కారణాలన్ని అమ్మడిని ఐరన్ లెగ్ చేసేశాయి. ఇక ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు అనుకుని కోలీవుడ్ బాట పట్టిన అమ్మడు అక్కడ కాస్త పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇక లక్కీగా బాలీవుడ్ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసిన కృతి ఇమ్రాన్ హష్మితో రాజ్ సీరీస్‌గా వస్తున్న రాజ్ రీబూట్‌లో నటించింది. ఇమ్రాన్ సినిమా అంటే ముద్దుల వర్షం కురవాల్సిందే. కృతితో ఇమ్రాన్ హష్మి లిప్ లాక్స్ సినిమాకే హైలెట్ అవనున్నాయట. అయితే ఇమ్రన్తో లిప్ లాక్ సీన్ల గురించి మాట్లాడుతూ తనతో ఆ సీన్స్ చేసేప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది కాని సినిమా కోసం తప్పలేదు అన్నది. ఇక తన కెరియర్లో మొదటి ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మినే అట.
అతనితోనే తన తొలి ముద్దు అనుభవం జరిగిందని అంటుంది కృతి. బీ టౌన్లో అడుగుపెట్టాక ముద్దు సీన్లేంటి ఇంకా రెచ్చిపోవాల్సిందే. మొదట అలా బెరుకుగా అనిపించినా అలవాటైతే ఇక అంతా మామూలే. బాలీవుడ్ అలవాట్లను ఇప్పుడిప్పుడే అలవరచుకుంటున్న కృతి అక్కడ నీళ్లు బాగా పడ్డట్టే ఉన్నాయనిపిస్తుంది. ఇక ఇన్ని హోప్స్ పెట్టుకున్న రాజ్ రీబూట్ కృతికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఆఫర్ల కోసం తనకు ఇష్టంలేని లిప్ లాక్ కూడా చేయాల్సి వచ్చిన కృతి సినిమా హిట్ అయితే అలాంటి ఆఫర్లనే వరుసెంట చేజిక్కించుకోవడం ఖాయం. బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే అటు శాండల్ వుడ్లో కూడా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటుంది కృతి. మరి చూస్తుంటే అమ్మడికి గుడ్ టైం వచ్చేసినట్టే అనిపిస్తుంది. మరి ఇలానే రెచ్చిపోతే హాట్ ఇమేజ్‌తో కృతి ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించే అవకాశం ఉంది. రాజ్ సీరీస్‌తో కృతి లక్ ఎలా మారుతుందో ఆ సినిమా రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది.


