బిసిల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కొమ్మాలపాటి
గుంటూరు, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): బిసిల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బిసిల అభ్యున్నతి వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. చేతివృత్తులు వారికి ఆదరణ పథకం ప్రవేశపెట్టిందని, బిసి సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వృతిపరంగా వారి జీవనోపాధిని పెంపొందిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు బిసిల సంక్షేమాన్ని మరిచాయని విమర్శించారు. దేశచరిత్రలో మొదటిసారిగా బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Categories

Recent Posts

