బీజేపీతో కలిసే ఉన్నాం
- 12 Views
- admin
- January 24, 2023
- తాజా వార్తలు
ఎన్నికలకు చాలా సమయం ఉందని… వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తుల గురించి మాట్లాడొచ్చని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. విపక్షాలను అణచివేయడానికే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు.
జనసేన ప్రస్తుతానికి బీజేపీతో కలిసే ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎవరు కలిసొస్తారో వారితో కలిసి ముందుకెళతామని అన్నారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకెళ్తామని తెలిపారు. ఎవరు కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ముందుకెళ్తామని చెప్పారు. ఎవరూ కలిసి రాకపోతే ఒంటరిగా ముందుకెళ్తామని అన్నారు.
Categories

Recent Posts

