బీసీలు ఐక్యంగా పనిచేయాలి: జస్టిస్ ఈశ్వరయ్య
- 92 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): బీసీలంతా ఐక్యంగా పనిచేయాల్సిన అవసం ఉందని జాతీయ బీసీ కమీషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ రాజనీతిశ్రాస్త విభాగంలో విద్యార్థులు, పరిశోధకులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటిత శక్తిగా నిలవాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యావంతులు సంఖ్య మరింత పెరగాలన్నారు. మన దేశంలో ప్రజలే శక్తిమంతులన్నారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాకు అనుగుణంగా ప్రజాప్రతినిధులను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుత మార్గంలో సాధించాలని సూచించారు. సంఘటితంగా పనిచేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. వెనుకబాటు తత్వాన్ని ముందుగా వదిలివేయాలన్నారు.
బిసిల ఐక్యతకోసం పనిచేయాలని సూచించారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు కమీషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్యను సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా వర్సిటీ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బిసిసంఘం అద్యక్షుడు నరవ రాంబాబు, రాష్ట్ర బిసి సంఘం అద్యక్షుడు కేశాన శంకరరావు, ఆచార్య వివేకానందమూర్తి, తుమ్మిడి రామ్‌కుమార్, పి.హరి ప్రకాష్, పి.విశ్వనాథం,పి.ప్రేమానందం, టి.కోటేశ్వరరావు, సూరప్పడు, దూవ్వారపు రామారావు, పితాని ప్రసాద్, శ్యామ్ సుందర్ నాయుడు, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఏ.సుబ్రహ్మణ్యం అభినందన సభ మంగళవారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించారు.
సమావేశానికి బిసి కమీషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంఘం అద్యక్షుడు కేశాన శంకరరావు, దామోదరం సంజీవయ్య న్యాయవిశ్వవిద్యాలయం ఇంఛార్జి ఉపకులపతి ఆచార్య వి.కేశవరావు, ఆదికవి నన్నయ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య పి.జార్జి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఏ.సుబ్రహ్మణ్యం అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఆచార్య సుబ్రహ్మణ్యంకు ఘన సత్కారం చేశారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు, నగర వాసులు పాల్గొన్నారు.
ఇంటర్హాస్పిటల్ క్రికెట్ టోర్నీ విజేత ‘పినాకిల్’
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఇంటర్ హాస్పిటల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పినాకిల్ హాస్పిటల్స్ టీం నిలచింది. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నిర్వహించిన ఈ పోటీలలో నగరంలోని మహాత్మగాంధీ కేన్సర్ ఆసుపత్రి, ఇండస్, మనిపాల్, సెవెన్‌హిల్స్, అపోలో, పినాకిల్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఈ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో పినాకిల్-స్టార్ హాస్పిటల్స్ జట్లు 5 వికెట్ల తేడాతో ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ జట్టుపై విజయం సాధించింది. పోర్టు మైదానంలో ఈ పోటీలను నిర్వహించారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి 12 ఓవర్లలో 106 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. పినాకిల్-స్టార్ హాస్పిటల్స్ జట్టు 11.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 108 పరుగులు సాధించి విజేతగా నిలచింది. టోర్నమెంట్ విజేతగా నిలచి పినాకిల్-స్టార్ హాస్పిటల్స్ ట్రోఫీని అందుకుంది. ఈ సందర్భంగా పినాకిల్ హాస్పిటల్స్ డైరెక్టర్ దగ్గుబాటి నివేదిత, డాక్టర్ మదన్ మోహన్, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, టీం మేనేజర్ ఇందిర పినాకిల్ క్రీడాకారులను మంగళవారం అభినందించారు.
అంతర్జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరించిన ఏయూ వీసీ
విశాఖపట్నం, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జనవరి 5-7వ తేదీ వరకు మూడు రోజులు సోషల్ బిజినెస్ ఫర్ సస్టైనబులు డెవలప్మెంట్ అంతర్జాతీయ సిపోజియం నిర్వహించనున్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం 90వ వసంతంలోనికి అడుగిడిన సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సు వివరాలతో కూడిన బ్రోచర్‌ను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, ప్రపంచం నలుమూల నుంచి నిపుణులను తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. తద్వారా వర్సిటీ ఆచార్యులకు, విద్యార్థులకు తమ ఆలోచనలను పంచుకునే వేదికను ఏర్పాటుచేయాలన్నారు. సదస్సుకు నోబెల్ బహుమతి గ్రహీత ఆచార్య మహమ్మద్ యూనస్‌ను ఆహ్వానించడం మంచి పరిణామన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏయూ 90 సంవత్సరాలలోనికి అడుగిడటం, ఆచార్య మహ్మద్ యునిస్ నోబోల్ శాంతి బహుమతి సాధించి దశాబ్ధం గడిచిందన్నారు. ఈ రెండింటిని సమ్మిళితం చేస్తూ ఏయూ, యూనిస్ సెంటర్(ఢాకా) సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయన్నారు. సదస్సు నిర్వహణ కార్యదర్శి ఆచార్య కె.రఘుబాబు మాట్లాడుతూ నోబెల్ బహుమతి గ్రహీత యూనిస్ ముఖ్య అతిధిగా పాల్గొంటారన్నారు. సదస్సులో డిజైనింగ్ 21 సెంచరీ ఎడ్యుకేషన్ టు బికమ్ ఏన్ ఎంటర్‌ప్యూనర్, గ్రీన్ ఎకానమీ -క్లీన్ ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ ఆఫ్ ఎనర్జీ అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. సదస్సును దేశం నలుమూల నుంచి 30 మంది నిపుణులు విచ్చేసి విశిస్ట ప్రసంగాలు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ఎంపీ ఎం.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నాయుడు, జాతీయ ఆర్గనైజింగ్ కమిటి చైర్మన్ ఆచార్య వి.ఎస్.ఆర్.కె ప్రసాద్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ తదితరులు పాల్గొన్నారు.


