బ్యాంకుల ఎదుట రైతుల ధర్నా
- 67 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
కరీంనగర్, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): రాజకీయ నాయకులకు దొంగచాటుగా కొత్త నోట్లు కోట్ల రూపాయల్లో అందుతుండగా లేనిది రైతులకు పంటలకు అవసరమయ్యే రుణాలను అందించడంలో బ్యాంకర్లు ఎందుకు నిరాకరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనరగ్, సిరిసిల్ల జిల్లాలోని బ్యాంకుల వద్ద రైతులు ప్రదర్శనలు నిర్వహించారు.
ఖరీప్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అవసరం ఉన్నందున బ్యాంకుల చుట్టు తాము తిరుగుతున్న రూ. 4 వేలు మాత్రమే ఇస్తున్నారని ఇది ఏ మేరకు సరిపోతాయని వాపోతున్నారు. ఈ 4 వేల రూపాయలతో పనులు ఎలా చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. రోజుల తరబడి బ్యాంకుల చుట్టు తిరుగుతున్న తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్‌కు అవసరమైన డబ్బును అందించాలని వారు డిమాండ్ చేశారు.


