బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలి
- 67 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): బ్యాంకరు సరళీకృత విధానంలో సమాచార లోపం లేకుండా ఎవరైతే వాస్తవంగా లబ్దిదారులో వారికి సంక్షేమ కార్యక్రమాల విధానంలో రుఖాలందించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐమైఆర్.కృష్ణారావు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టరు ఛాంబరులో ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరు చాగవల్లి వెంకట్, కలెక్టరు బాబుతో కలిసి మంగళవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఐవై ఆర్.కృష్ణారావు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన రంగాల వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు స్వయం ఉపాధికార్యక్రమాలను నిర్వహించేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ముందుకు రావడం జరిగిందన్నారు.
ఇందులో భాగంగా లక్ష50వేల నుంచి రు.5 కోట్ల వరకు వివిధ పధకాలను అందంచడం జరుగుతోందన్నారు. అంత్యోదయ, అభ్యుదయ పధకాలలో భాగంగా 80 నుంచి 60 శాతం వరకు సబ్సిడీని బ్యాంకర్లకు ముందుగానే విడుదల చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పధకంలో భాగంగా 40 శాతం సబ్సిడీ అత్యధికంగా 2 లక్షల వరకు సబ్సిడీని అందిస్తామన్నారు. ప్రతిపాదించిన ప్రాజెక్టు అంచనాలలో బ్యాంకులోను మినహా మిగతా మొత్తానికి యూనిట్ స్థాపనకు బ్యాంకరు చొరవ చూపాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు వచ్చే దరఖాస్తులను జిల్లాలోని లీడ్ బ్యాంక్ మేనేజర్లకు పంపుతామని లబ్దిదారులు ఏ ప్రాంత బ్రాంచి పరిధిలోకి వస్తారో ఆ బ్యాంకర్లకు సిఫార్సు చేయ్యాలని చైర్మన్ సృష్టం చేశారు.
కార్పొరేషన్ డైరక్టర్ వెంకట్ చాగవల్లి వెంకట్ మాట్లాడుతూ బ్రాహ్మణ ద్వారా రాష్ట వ్యాప్తంగా వొచ్చిన దరఖాస్తులలో ఇప్పటివరకు 2084 దరఖాస్తులకు మంజూరు ఇవ్వగా వాటిలో కృష్ణా జిల్లాలో 500కుపైగా అప్లికేషన్లు వున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంత్యోదయ కింద 1100 కు పైగా దరఖాస్తులను అభ్యుదయ కింద 900 కు పైగా దరఖాస్తులు , అభివృద్ధి కింద 720 కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. లబ్దిదారుల ప్రతిపాదిత ప్రాజెక్టుకు, వారి ఆలోచనలకు నమ్మకం కలిగేలాగ బ్యాంకర్డు ముందుకు వచ్చి రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు నారాయణ మూర్తి, అజిమ్ ప్రేమ్ జీ, తదితరులు 1980 దశకంలో ఆనాటి బ్యాంకర్లు ఇచ్చిన రుఖాలు వలనే ఈ రోజు రు.10 వేల కోట్లకుపైగా సంపాదనపరులు అయ్యారని ఆయన తెలిపారు.
గత ఏడాది కార్పొరేషన్లకు మంజూరు చేసిన రు.65 కోట్లలో రు.30 కోట్ల విద్యకోసం ఖర్చుచేయడం జరిగిందన్నారు. పిహెచ్డి వరకు చదివే విద్యార్ధులకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం ఖర్చుచేశామన్నారు. 20 శాతం మేర నిధులతో ప్రభుత్వం ద్వారాపించనురాని 7 వేల మందికి పింఛన్లను ఇవ్వడం జరుగుతోందని ఆయన తెలిపారు. కలెక్టరు బాబు.ఎ మాట్లాడుతూ సరళీకృత విధానంలో బ్యాంకరు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా, వ్యక్తిగతంగా , జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చే వ్యక్తుల ప్రాజెక్టు ప్రతిపాదనల ప్రకారం రుణాలను అందించాలన్నారు. వివిధ పధకాలలో భాగంగా కార్పొరేషన్ బ్యాంక్ అండ్ సబ్సిడి , సబ్సిడి అందిస్తోందన్నారు.
అంత్యోదయ కింద లక్ష రూపాయల వరకు కుటుంబ ఆదాయం గల వ్యక్తులకు రు. లక్ష 50 వేల వరకు ప్రాజెక్టుల ధరలో 80 శాతం (రు. లక్ష20వేలవరకు), సబ్సిడీగా అందించడం జరుగుతుందని , మిగతా మొత్తానికి బ్యాంకరు రుణాలు అందించాలన్నారు. అభ్యుదయ కింద రు.1 లక్ష60 వేలు నుంచి 3 లక్షల వరకు ప్రాజెక్టు ధరలలో 60 శాతం (లక్ష80 వేలు వరకు), అభివృద్ధి కింద రు.3లక్షల 10 వేలు నుంచి 10 లక్షల వరకు ప్రాజెక్టు ధరలలో 40 శాతం (2.5 లక్షల వరకు) సబ్సిడీగా అందించడం జరుగుతుందని మిగతా మొత్తానికి బ్యాంకర్లు రుణాలు అందించాలన్నారు. బ్యాంకర్లు వారికొచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కారం చూపి రుణాలు అందివ్వాలన్నారు. విజయవాడ నగర పరిధిలో గండూరు మహష్ కార్పొరేటర్, కృష్ణా జిల్లా పరిధిలో వి.బాలాజీ సువర్ణకుమార్, సమన్వయ కర్తలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పరిధిలో బ్యాంకర్లతో వి.ఎస్.సుబ్రమణ్యేశ్వరరావు సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు పాల్గొన్నారు.


