బ్లాక్ మనీ వివరాలపై వేలల్లో ఈమెయిళ్లు
నల్లధనం ఎవరి దగ్గరైనా ఉందని అనుమానం వస్తే తెలియజేయలాంటూ, భారత ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన తర్వాత క్షణం నుంచి ఈ మెయిల్ వెల్లువెత్తాయి. బ్లాక్మనీఇన్ఫోఇన్కంట్యాక్స్ టాట్కాంకు మెయిల్ నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలు ఇవ్వాలని మోదీ సర్కార్ కోరిన నేపథ్యంలో 72 గంటల వ్యవధిలో 4 వేలకుపైగా మెయిల్స్ వచ్చాయి. తమ విన్నపానికి ప్రజల నుంచి అధ్బుత స్పందన వచ్చిందని, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఈ మెయిల్స్ అన్ని పరిశీలిస్తున్నామని, అనుమానం వస్తే, వాటిని పరిశీలిస్తున్నామని, దాడులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సదరు అధికారి తెలిపారు. ఈ మేరకు ఎన్‌ఐయూ ఫైనాన్షియల& ఇంటెలిజన్స్ యూనిట్ చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. జన్‌ధన్ ఖాతాల్లో చేరిన భారీ మొత్తంలో డబ్బుతోపాటు, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు, బ్యాంకు అధికారుల ప్రమేయం తదితరాంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా చ్చాయని, బంగారం లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు తదితరాలపైనా మెయిన్స్ అంతుకున్నామని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు.


