భారతీయ క్రికెటర్ కృష్ణమాచారి
కృష్ణమాచారి శ్రీకాంత్… 1959 డిసెంబర్ 21న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన కృష్ణమాచారి శ్రీకాంత్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1981లో ఇంగ్లాండుపై అహ్మదాబాదులో తొలి వన్డే, ముంబాయిలో తొలి టెస్ట్ ఆడి అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించారు. 21 ఏళ్ళ వయసులోనే సునీల్ గవాస్కర్‌కు జతగా ఓపెనర్‌గా భారత జట్టు తరఫున ఆడిన రికార్డు ఆయన సొంతం.
అయితే ఇద్దరికీ ఆట విధానమ్లో చాలా తేడా ఉన్నప్పటికీ శ్రీకాంత్ భారతీయ క్రికెట్ క్రీడలో తనదైన ముద్ర వేసుకున్నట్లు చరిత్ర స్పష్టంచేస్తోంది. గవాస్కర్ నైపుణ్యం కల బ్యాట్స్‌మెన్ కాగా శ్రీకాంత్ బ్యాటింగ్ హిట్టర్. తన హిట్టింగ్ ద్వారా ముఖ్యంగా వన్డేలలో భారత జట్టుకు మంచి శూభారంభం చేసేవాడు. గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్, మోహిందర్ అమర్నాథ్ లాంటి నైపుణ్యం కల బ్యాట్స్మెన్ల కాలంలోనూ జట్టులో హిట్టర్‌గా నిలదొక్కున్నాడంటే అతని ప్రతిభను ప్రశంసించాల్సందే. అతని 43 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 2062 పరుగులు చేసారు.
ఇందులో 2 సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో భారత జట్టుకు 146 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 4091 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. ఇందులో 4 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు ఉన్నాయి. 1983లో ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో కూడా ఇతను ప్రాతినిధ్యం వహించారు శ్రీకాంత్. 1989లో శ్రీకాంత్ భారత జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఒకే వన్డేలో 5 వికెట్లు, అర్థ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడితను. 1988లో న్యూజీలాండ్‌పై విశాఖపట్నం వన్డేలో ఈ ఘనత సాధించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చి మంచి ఫలితాలను సాధించారు. ప్రస్తుతం ఇతను టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.


