మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తండ్రయ్యాడు. కరీనాకపూర్ను వివాహం ఆడిన సైఫ్ పెళ్లి తర్వాత మంచి విజయాలనే దక్కించుకున్నాడు. సైఫ్ భార్య కరీనా కపూర్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు కరీనా జన్మనిచ్చింది. తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
పుట్టిన వెంటనే తమ కుమారుడికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెట్టారు కపూర్ జంట. చేతినిండా చిత్రాలంటూ లేకపోయినా వచ్చిన అవకాశాలను జారవిడుచుకోకుండా సైఫ్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. ఇప్పుడు తమ కుటుంబంలోకి కుమారుడు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఆయన విజయాల పరుగు ఎలా ఉంటుందో చూడాలి.
Categories

Recent Posts

