మట్టి ప్రతిమలతో పూజలు చేయండి: జేసీ-2 వెంకటరెడ్డి
పర్యావరణ పరిరక్షణకు జర్నలిస్టులు చేస్తున్న సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ 2 డివెంకటరెడ్డి చెప్పారు. వీజేఎఫ్ ఆధ్వర్యంలో సీతమ్మధార నార్ల వెంకటేశ్వరావు భవన్ వద్ద మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జేసీతో పాటు ఏయూ మాజీ వీసీ జిఎస్ఎన్రాజు, స్వాతిప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వీజేఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఎవరూ చేయలేని విధంగా చేస్తున్నారని కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.
ఎయు మాజీ వీసీ జిఎస్ఎన్రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా జర్నలిస్టులు చేపట్టే సాంప్రదాయ కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేయడం ఆనందదాయకమన్నారు. నగరాభివృద్దిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. నేడు మట్టి ప్రతిమలు మొక్కలు పర్యావరణాన్ని దృష్టిలో వుంచుకొని బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం శ్లాఘనీయమన్నారు. స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణరెడ్డి మాట్లాడుతూ పర్యావరాణాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మట్ట ప్రతిమలు విగ్రహాలతో పూజించాలని కోరారు. దీనిలో భాగంగానే ప్రతి ఏడాది మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తనను కూడా వీజేఎఫ్ జర్నలిస్టులతో భాగస్వామ్యం చేయడం ప్రశసంనీయమన్నారు.
వీజేఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నగరంలో 30 వేల మొక్కలను స్వాతి ప్రమోటర్స్ సౌజన్యంతో పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమం ధ్యేయంగా వీజేఎఫ్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని భవిష్యత్లో కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా వున్నామన్నారు. రెండు మూడురోజుల్లో డెస్క్ జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు మంజారు. కానున్నాయిని కలెక్టర్ సంతకాలు కూడా పూర్తియ్యాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీజేఎఫ్ కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజ్ పట్నాయక్, టి నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గసభ్యులు ఇరోతి ఈశ్వరావు తదితరులు పాల్గోన్నారు.


