మలేరియాకు మందు కనిపెట్టిన ఆసిమా
కలకత్తా, సెప్టెంబర్ 22: ఆసిమా చటర్జీ… ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు. ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు. అసిమా చటర్జీ 23 సెప్టెంబర్ 1917 తేదీన బెంగాల్లో జన్మించారు. ఆమె తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ. కలకత్తా యూనివర్శిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొంది(1944), అమెరికా వెళ్ళి యూనివర్శిటీ ఆఫ్ విస్కన్‌సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు. పుట్టిన దగ్గరినుండి జీవితాంతం కలకత్తాలోనే గడిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి1936లో రసాయనశాస్త్రంలో పట్టా పొందారు. 1938 లో ఆమె ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
ఈమె కలకతతా విశ్వవిద్యాలయం నందు డాక్టరల్ వర్క్ పూర్తిచేశారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రం లో వృక్ష ఉత్పత్తుల గూర్చి పరిశోధనలు చేశారు. ఈమె ప్రఫుల్ల చంద్ర రే, ప్రొఫెసర్ ఎస్.ఎన్.బోస్ అధ్వర్యంలో పరిశోధనలు చేశారు. ఈమె 1940లో కలకత్తా యూనివర్శిటీ యొక్క లేడీ బ్రబోర్నె కాలేజీలో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు. 1954లో ఆసిమా చటర్జీ కలకత్తా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా కెమిస్ట్రీ విభాగంలో చేరారు. 1962లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా పనిచేయుచున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు.
ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్శిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా, ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పలు పదవులు నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలుగా (1982 – 90) ఉన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు. ప్రొఫెసర్ ఆసిమా భారతీయ ఔషథ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు. 240కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. జర్న ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీకి సంపాదకులుగా ఉన్నారు.
అమెరికాలోని సిగ్మా సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. కలకత్తా యూనివర్శిటీ వారి నాగార్జున ప్రైజ్ మరియు గోల్డ్ మెడల్ (1940), ప్రేమ్‌చంద్ రాయల్ స్కాలర్ ఆఫ్ కలకత్తా యూనివర్శిటీ, యూనివర్సిటీ కలకత్తా నుండి సైన్స్ లో డాక్టరేట్ చేసిన మొదటి మహిళ (1944), 1948 – 49 : వాటుముల్ ఫెలోషిప్(అమెరికా), 1962-1982 మధ్య ఆమె ఖైరా ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇది యూనివర్శిటీ ఆఫ్ కలకత్తా కు చెందిన అత్యంత గౌరవ పదవి, 1960: న్యూఢిల్లీ లోని ఇండియన్ నేషనల్ అకాడమీ యొక్క ఫెలోగా ఎంపిక, 1961: శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (రసాయన శాస్త్రం), ఈ అవార్డును పొందిన మొదటి మహిళ, 1975 : పద్మభూషణ్ అవార్డు. ఈ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త. 1981 : భువన్ మోహన్ దాస్ గోల్డ్ మెడల్, 1985 : సర్ సి.వి.రామన్ అవార్డు, 1989 : సర్ అసుతోష్


