మళ్లీ వార్తలకెక్కిన వర్మ
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తలకు ఎక్కే సినీ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ తాజాగా స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణపై కామెంట్ చేసి మరోమారు వార్తల్లో నిలిచారు. నందమూరి నట సింహం బాలయ్య తాజాగా నటిస్తున్న తన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఒకపక్క పెరుగుతుంటూ మరోపక్క విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చలరేగుతున్నాయి. అన్ని వర్గాల వారు ఆ సినిమాను ప్రశంసనలతో ముంచెత్తారు. ఇప్పుడు అందులో రాంగోపాల్ వర్మ కూడా చేరిపోయాడు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో ‘ఖైదీ నెం.150’కి పోలికే లేదు అని వర్మ చేసిన ట్వీట్స్‌కి మెగాస్టార్ అభిమానుల నుంచి ఎప్పటిలాగే గట్టి సమాధానమే వచ్చింది. అయితే, మెగాస్టార్ అభిమానులు తనపై విరుచుకుపడటాన్ని గమనించిన వర్మ వెంటనే ఇంకొన్ని ట్వీట్స్ చేశాడు. తాను కూడా మెగాస్టార్ అభిమానినే అని చెప్పారు. అందుకే మెగాస్టార్ ఎప్పుడూ బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నాడు.


