మహేష్ అభిమానుల భయం అందుకేనా?
సూపర్ స్టార్ మహేష్ సినిమా హిట్ అయితే ఏ రేంజ్ కలక్షన్స్ వస్తాయో అదే సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు ఎంత లాస్ అవుతారో తెలిసిందే. ప్రస్తుతం ట్రెండ్ మార్చిన స్టార్ హీరోలు కథాబలమున్న సినిమాల వైపు అడుగులేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దర్శకుల తప్పిదం వల్ల స్టార్ హీరోలు ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నారనుకోండి. ప్రస్తుతం మురుగదాస్‌తో సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా రిలీజ్ విషయంలో మళ్లీ అభిమానులను కంగారు పెట్టిస్తున్నాడు. మహేష్ సినిమా ఎప్పుడు వచ్చినా సరే సరైన సినిమా పడితే అది సూపర్ హిట్ అన్నట్టే.
బాహుబలి తర్వాత శ్రీమంతుడు లాంటి సినిమాతో నాన్ బాహుబలి రికార్డులన్ని క్రాస్ చేసేశాడు మహేష్. అయితే ఇప్పుడు అన్ని కుదిరినా ఒక్కోసారి సినిమా రిలీజ్ విషయంలో సెంటిమెంట్లు బాగా ప్రభావం చూపుతాయి. ఆ క్రమలోనే మహేష్ మురుగదాస్ సినిమా వచ్చే సమ్మర్ రిలీజ్ అనేస్తున్నారు. సమ్మర్ అనగానే మహేష్ ఫ్లాప్ సినిమాల లిస్ట్ గుర్తొస్తుంది. మహేష్ ఇండస్ట్రీ రికార్డులు సాధించిది అదే సమ్మర్లో మే నెలలో రిలీజ్ అయిన నిజం, నాని సినిమాలు మహేష్‌కు మంచి పేరు తెచ్చి పెట్టినా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.
అయితే ఇప్పుడు మురుగదాస్ సినిమా కూడా మే నెలలోనే రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి మళ్లీ రిస్క్‌లో పడతాడేమో అని మహేష్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. మురుగదాస్ సినిమా అంటే కచ్చితంగా కమర్షియల్ అంశాలే కాదు అదరగొట్టే స్టోరీ కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే సినిమా ఏ టైంలో వచ్చినా అది సూపర్ హిట్ అనేస్తున్నారు. మహేష్‌తో రకుల్ ప్రీత్ సింగ్ జోడి కడుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దాదాపు 80 కోట్ల రూపాయలకు మించిన బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నారు.


