మాటల మాంత్రికుడి మాయాజాలం: దేవుడే దిగివచ్చినా…
వెండితెరపై కొన్ని కాంబినేషన్లను మాత్రమే అభిమానులు అంతగా ఆదరిస్తారు. తెరముందే కాదు, తెర వెనుక కూడా కొందరినే వారు ఆరాధిస్తారు కూడా. పలానా దర్శకుడితో పలానా హీరో పనిచేస్తే ఉత్తమ ఫలితం వస్తుందన్న అభిమానుల అంచనాలు బాక్సాఫీసును షేక్ చేసిన సందర్భాలు అనేకం. ఉదాహరణకు పవర్ స్టార్ పవన్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ తరువాత ఆ రెంజ్‌కి మించిన హిట్‌ను పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ విషయంలో పవన్ కొన్ని ప్రయత్నాలు చేసినా తన అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’లో నటిస్తూ ఉన్నా అభిమానుల కోరిక మాత్రం పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌పైనే ఉంది. అభిమానుల కోరికను మన్నిస్తూ ఎట్టకేలకు పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ సెట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అత్యంత వేగంగా స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ 100 బడ్జెట్ అవసరం అని ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
దీనితో టాలీవుడ్లో ‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాగా ఈ మూవీ మారబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు త్రివిక్రమ్ ‘దేవుడే దిగివచ్చినా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈసినిమాలో కామెడీ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు పవన్ పొలిటికల్ కెరియర్‌కు కలిసి వచ్చేలా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా త్రివిక్రమ్ సృష్టిస్తున్నట్లు టాక్. ఫిలింనగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పవన్ రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీకి ఉపయోగపడేలా త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నట్లు టాక్.
గతంలో నందమూరి తారక రామారావు రాజకీయాలలోకి రాక ముందు దాసరి తీసిన బొబ్బిలి పులి ఏ విధంగా రామారావు రాజకీయ జీవితానికి ఉపయోగపడిందో అదేవిధంగా ఈ సినిమాను పవన్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని త్రివిక్రమ్ తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు టాక్. ఎట్టి పరిస్తుతులలోను ఈ సినిమా జనవరిలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో 2017లో పవన్ నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతూ ఉండటం పవన్ అభిమానులకు జోష్ ఇచ్చే విషయం అనుకోవాలి.
తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది కాంబినేషన్ చిత్రాలు అద్భుత విజయాన్ని సాధిస్తుంటాయి. అలాంటి రేర్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. జల్సా తో వీరిద్దరి పయణం సాగుతూ వస్తుంది. ఇక రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా ఇద్దరూ మంచి ఆప్త మిత్రులు కావడం విశేషం. ఇప్పటికే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు బ్లాక్ బ్లస్టర్ అయ్యాయి. ఇప్పుడు మూడవ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ సంవత్సరం పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో అభిమానుల్లో నిరుత్సాహం పెరిగిపోయింది. దీంతో తన తదుపరి చిత్రంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు పవన్. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం పూర్తి కాగానే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్‌తో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్‌ని ఫైనలైజ్ చేసుుకుంటున్నాడు త్రివిక్రమ్. స్టోరీ లైన్‌పై ఓ తుది రూపు వచ్చేయగా ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకునే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్‌పై కూడా ఇప్పటికే ఓ అంచనా వచ్చేసినట్లు తెలుస్తోంది.


