మార్కెట్లోకి షియోమీ స్మార్టు వాచ్!
- 83 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
పిల్లలు కూడా స్మార్ట్ అయిపోతున్న రోజులివి. వారికోసం చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ షియోమి సరికొత్త స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మి బన్నీగా నామకరణం చేసిన ఈ స్మార్ట్ వాచ్ ఖరీదు 3 వేల రూపాయలు. మి.కామ్ వెబ్సైట్లో దీనిని అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. చిన్న పిల్లల కోసం షియోమి నుంచి వచ్చిన మొదటి స్మార్ట్ వాచ్ ఇదే కావడం విశేషం. తల్లిదండ్రులకు పిల్లల గురించి తెలుసుకునేలా ఈ వాచ్‌ను రూపొందించారు. ఈ స్మార్ట్ వాచ్ జీపీఎస్ కనెక్టివిటీ, వైఫై కలిగి ఉండి, వాయిస్ కాల్స్‌కు సపోర్టు చేస్తుంది.
ఒక సిమ్ కూడా దీనిలో ఉంటుంది. ఆరుగురు కుటుంబ సభ్యుల నెంబర్స్ కలిగి ఉండి, వారితో ఉచితంగా మాట్లాడగలిగే సదుపాయం ఉండటం ఈ వాచ్‌లోని స్పెషల్ ఫీచర్. ఒకవేళ పిల్లలు పరిసర ప్రాంతాల్లో లేనిసమయంలో ఈ యాప్ ద్వారా వారితో మాట్లాడుకునే సౌకర్యం ఉంటుంది. సురక్షితమైన ప్రాంతాల్లో పిల్లలు ప్రయాణించేలా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల ద్వారా వారిని గైడ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ వాటర్ ఫ్రూప్, 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎల్ఈడీ డాట్ మ్యాట్రిక్స్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 4.2 దీనిలోని ఫీచర్స్. బ్లూ, పింక్ రంగులో ఈ స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి.


