మావోయిస్టుల కదలికలపై కన్నేసిన పోలీసులు
- 79 Views
- wadminw
- January 14, 2017
- Home Slider రాష్ట్రీయం
కరీంనగర్: జిల్లా తూర్పుతీర ప్రాంతం ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పుల్లతో వణికిపోతోంది. మావోయిస్టులను కట్డడి చేయడానికి పోలీసుల తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏ విధంగానైనా మావోయిస్టుల ప్రాభాల్యాన్ని తగ్గించాలని దృడ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి మహదేవపూర్ ప్రాంతంలోకి మేకల రాజు అలియాస్ మురళి దళం అడుగుపెట్టింది. ఆ సమయంలో గోదావరికి వరద రావడంతో వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు గోదావరి ప్రవాహం తగ్గడంతో ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరిని దాటుతున్న మావోయిస్టులు మహాదేవ్‌పూర్, మహాముత్తారం మండలాల పరిధిలోని సరిహద్దు గ్రామాల్లోకి వస్తున్నారు.
మావోయిస్టుల కదలికలను పసిగట్టిన పోలీసులు వారిని ఎలాగైనా మట్టుపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గోదావరి సరిహద్దులో కూంబింగ్‌కు వెళ్తున్న దళాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోంది. బొర్లగూడెంలో మాత్రమే సెల్‌టవర్ నిర్మాణం పూర్తయింది. ఇంకా కాళేశ్వరం, సర్వాయిపేట, కనకనూర్, సంగపల్లిలో సాధ్యమైనంత త్వరగా సెవర్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. మహాదేవ్‌పూర్ మండలంకేంద్రం నుంచి ముకునూర్, దమ్మూరులాంటి ప్రాంతాలు అరవై కిలోమీటర్లకుపైగా ఉండటం మధ్యలో 10,15 కిలోమీటర్ల దూరం రహదారులు లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. కొన్ని గ్రామాల్లో వాగులపై వంతెనలు లేకపోవడం రహదారులు, వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
మావోయిస్టులపై పోరు నడుపుతూనే వారిలోని కొంతమందిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయా గ్రామాలకు రహదారులు ఉంటే రాకపోకలు సక్రమంగా నడుస్తాయని భావిస్తున్నారు. అప్పుడే బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని భావిస్తున్నారు. ఉపాధి అవకాశాలు దొరికితే యువతీ, యువకులు నక్సలిజం వైపు మొగ్గు చూపరనే భావనలోనూ పోలీసులు ఉన్నారు.


