మిస్టరీగా మారిన పింక్ డైమండ్
- 76 Views
- admin
- May 21, 2018
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
(ప్రత్యేకప్రతినిధి – ఫీచర్స్ఇండియా)
తిరుమల శ్రీవారికి ఆభరణాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని పోయాయి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశమంతటా విన్పిస్తున్నాయి. ప్రధాన అర్చకులు రమణదీక్షితుల ఆరోపణలతో కొత్త అనుమానాలు బలపడుతున్నాయి. అయితే శ్రీవారి వజ్రాల హారంలోని పింక్ డైమండ్ మాయమైందని రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. 2001లో గరుడసేవ రోజున స్వామికి అలంకరించిన తరువాత హారంలో పింక్ డైమైండ్ కనిపించకుండాపోయింది. భక్తులు నాణేలు విసరడం వల్ల ఆ వజ్రం పగిలిపోయినట్లు రికార్డుల్లో ఆ తరువాత రాశారని కూడా దీక్షితులు చెబుతున్నారు. ఆ మధ్య ఇదేరకమైన పింక్ డైమైండ్ను జెనీవాలో వేలం వేసినట్లు, వందల కోట్ల ధర పలికినట్లు పత్రికల్లో చదివానని రమణ దీక్షితులు అంటున్నారు. ఆ వజ్రం శ్రీవారిదే అయివుంటుందనేది రమణ దీక్షితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ వజ్న్రాన్ని 1945లో అప్పటి మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా ఇచ్చారు. ఇది వజ్రం కాదని, కెంపు మాత్రమేనని, భక్తులు విసిరిన నాణేల వల్ల అది పగిలిపోయిందని, స్వామివారి పీఠం వద్ద కొన్ని ముక్కలు కూడా లభ్యమయ్యాయని, ఆ ముక్కలు తనకు చూపించారని జస్టిస్ జగన్నాథరావు ఇచ్చిన నివేదికలో పేర్కొనట్లు ఈవో వివరించారు. ఇదే విషయాన్ని 2010లో అప్పటి ఈవో ఐవైఆర్ క ష్ణారావు కూడా ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. అప్పడు భద్రపరచిన కెంపు ముక్కలను కూడా ఈవో మీడియాకు చూపించారు. ఒక జస్టిస్ పరిశీలన జరిపి తేల్చేసిన విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. దీక్షతులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సింఘాల్ చెప్పారు. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
1. మైసూర్ రాజా వారు శ్రీవారికి వజ్రం కాకుండా కెంపు బహుమతిగా ఇస్తారా? ఒక రాజు ఇలాంటి పని చేస్తారా?
2. జస్టిస్ జగన్నాథరావు కూడా అధికారులు చూపించిన కెంపు ముక్కలను చూశారు. వారు చూపించింది చూసి అది కెంపు అని ఆయన నిర్దారణకు వచ్చారు. అయితే అప్పటికే శ్రీవారి హారాన్ని జస్టిస్ చూడలేదు. దీంతో ఆయన అధికారులు చూపించిన కెంపు చూసి అది పగిలిపోయిందని నిర్ణారణకు వచ్చారు. ఆయన అంతకుముందు ముందు హారాన్ని చూస్తే ఆయన చూసింది వజ్రామా? కెంపునా అనేది తెలిసేది.
3. వజ్రంలో ఉండే మెరుపు కెంపులో కనిపించదు. వజ్రాన్ని కాజేసి, ఆస్థానంలో నకిలీ రాళ్లను పొందుపరచివుంటారన్న అనుమానాలూ ఉన్నాయి. పగిలింది నిజంగా కెంపు అయితే%ౌౌ%అంతకు ముందే వజ్రాన్ని మాయం చేసివుంటారనేది ఓ అనుమానం.
4. శ్రీవారికి అతి దగ్గరగా మెలుగుతూ, నిత్యం శ్రీవారి ఆభరణాలను చూస్తుండే అర్చకులకు మాత్రం అది వజ్రమో, కెంపో, సాధారణ రాయో ఇట్టే తెలిసిపోతుంది.
5.రమణదీక్షితులు చెప్పినట్లు జెనీవాలో ఉన్న రాజ్ పింక్ డైమెండ్ యజమాని ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే ఆ డైమండ్ ఎవరు అమ్మారనేది తెలుస్తోంది. దాని ద్వారా డైమండ్ గుట్టు వీడిపోతుంది.


