ములాయం మరణం బాధిస్తోంది
- 82 Views
- admin
- October 10, 2022
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం తనను బాధిస్తోందనీ, ఆయన కుటుంబానికి, ఆయన లక్షలాది మద్దతుదారులకు తన సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మేము మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న సమయంలో ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సన్నిహిత సంబంధం అలాగే కొనసాగింది. ఆయన అభిప్రాయాలు వినడానికి నేను ఎప్పుడూ ఆసక్తి చూపేవాడిని. యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అత్యవసర కాలంలో (ఎమర్జెన్సీ) ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన సైనికుల్లో మఖ్యమైన నేత. రక్షణ మంత్రిగా భారత్‌ను బలోపేతం చేశారు. పార్లమెంటు చర్చల్లో ఆయన ప్రమేయం అంతర్ దృష్టితో, దేశ ప్రయోజన హితంగా ఉండేదని పేర్కొన్నారు.
Categories

Recent Posts

