మెగా ఫ్యాన్స్‌కి శుభవార్త!
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల హవా కొనసాగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన మగధీర చిత్రంతో రికార్డులు నెలకొల్పాడు. ఇలా చెర్రీ చేసినవి కొన్ని చిత్రాలే అయిన దాదాపు అన్ని బ్లాక్ బ్లస్టర్గా నిలిచాయి. అయితే మనోడికి గత మూడు సంవత్సరాల నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ వంటి చిత్రాల పరాజయం కాగా ఇప్పుడు తమిళ సూపర్ హిట్ చిత్రం తనఒరువన్ చిత్రం రిమేక్ ధృవగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ధువ టీజర్ మంచి ఆదరణ పొంది 3 మిలియన్ల మార్క్ దాటేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఆడియో వేడుక కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మెగా అభిమానులకు మంచి శుభవార్త. ధృవ చిత్రానికి సంబంధించి నవంబర్ 20న ఈ ఆడియో రిలీజ్ జరగనుంది. ఇక ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాబోతున్నారట. కానీ చరణ్ టీమ్ నుండి పవన్ కళ్యాణ్ విషయాల్లో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఆ మధ్య గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్‌కి అన్నయ్య మెగాస్టర్ చిరంజీవిని పవన్ కళ్యాన్ సాదరంగా ఆహ్వానించడం ఇద్దరు కలిసి సెల్ఫీలు దిగడంతో ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేలిపోయింది. ఇప్పుడు ఇదే అభిమానంతో అబ్బాయి ఆడియో వేడుకకు ఆహ్వానిస్తే పవన్ కళ్యాన్ ఖచ్చితంగా వస్తాడనే అనుకుంటున్నారు మెగా అభిమానులు. ఇదే గనుక నిజమై పవన్ వేడుకకు వస్తే మెగా హీరోలందరినీ మరోసారి ఒకే వేదికపై చూసే అవకాశం దక్కుతుంది అభిమానులకు. ఇకపోతే ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది.


